ఉన్నట్టుండి బరువు పెరుగుతున్నారా? కారణాలివే!

కారణాలెన్నో..
సడెన్‌గా బరువు పెరగడం అనేది పలురకాల అనారోగ్యాలకు సంకేతం. ఇలా ఉన్నట్టుండి బరువు పెరగడానికి రకరకాల కారణాలుంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హైపోథైరాయిడిజం
థైరాయిడ్ గ్రంథి మెటబాలిజంను కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఉన్నట్టుండి బరువు పెరిగితే అది హైపోథైరాయిడిజం లక్షణం కావొచ్చు. కాబట్టి వేగంగా బరువు పెరుగుతున్నవాళ్లు ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి.
నిద్రలేమి
సడెన్‌గా బరువు పెరగడానికి నిద్ర లేమి కూడా కారణం అవ్వొచ్చు. ఎందుకంటే నిద్రలేకపోవడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతిని హార్మోన్ల ప్రొడక్షన్ తగ్గుతుంది. తద్వారా ఆకలి పెరిగేలా చేస్తుంది.
కిడ్నీ ప్రాబ్లమ్స్
ఆకస్మికంగా బరువు పెరగడానికి కిడ్నీ సమస్యలు కూడా కారణం కావొచ్చు. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే, శరీరం ద్రవాన్ని నిలుపుకుంటుంది, తద్వారా బరువులో మార్పు వస్తుంది. కాబట్టి బరువు పెరుగుతుంటే ఒకసారి కిడ్నీ టెస్ట్ చేయించుకోవడం మంచిది.
పీసీఓఎస్
చాలామంది మహిళల్లో ఉన్నట్టుండి బరువు పెరగడానికి పీసీఓఎస్ కారణంగా ఉంటోంది. పీసీఓఎస్ వల్ల హార్మోన్ల ఇంబాలెన్స్ ఏర్పడి వేగంగా బరువు పెరుగుతారు.
సైడ్ ఎఫెక్ట్స్
కొన్నిరకాల మెడిసిన్స్ ప్రభావం వల్ల కూడా బరువు పెరుగుతుంటారు చాలామంది. దీర్ఘకాలిక వ్యాధుల కోసం వాడే కొన్ని మందులు మెటబాలిజం, హార్మోన్లపై ఎఫెక్ట్ చూపుతాయి. తద్వారా బరువులో మార్పు వస్తుంది.
ఇవి కూడా
ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు కూడా బరువు పెరగడానికి కారణం అవుతాయి. ఒత్తిడి వల్ల తినాలనే కోరిక పెరుగుతుంది. తద్వారా బరువు పెరుగుతారు. ఇలాంటి వాళ్లు వ్యాయామం ద్వారా ఒత్తిడి తగ్గించుకోవచ్చు.