ఎక్కువ సార్లు టీ తాగుతున్నారా ? ఈ అనారోగ్యాలు తప్పవు జాగ్రత్త..!
గుండెల్లో మంట వేధిస్తుంది..!
NCBI ప్రకారం, టీలో ఉండే కెఫిన్ గుండెల్లో మంట, ఎసిడిటీకి కారణం అవుతుంది. ఇందులో ఉండే అసిడిక్ గుణాలకు పొట్టలో యాసిడ్ ఉత్పత్తిని పెంచే సామర్థ్యం ఉంది. అందుకే ఎక్కువ మోతాదులో, ఖాళీ కడుపుతో టీ తాగడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
మలబద్ధకం తీవ్రమవుతుంది
టీ ఎక్కువగా తాగడం వల్ల మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది. టీలో థియోఫిలిన్ ఉంటుంది, ఇది జీర్ణక్రియ సమయంలో డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. దీని వల్ల మలం గట్టిపడుతుంది, పొట్ట సరిగా శుభ్రం అవ్వదు.
తలనొప్పిని ట్రిగ్గర్‌ చేస్తుంది
టీలలో ఉండే కెఫీన్‌కి తలనొప్పిని తగ్గించే శక్తి ఉంది. తలనొప్పిగా ఉంటే చాలామంది టీ తాగుతూ ఉంటారు. దీన్ని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మాత్రం తలనొప్పికి కారణం అవుతుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఒకటి లేదా రెండు కప్పులకు మించి తాగకూడదు.
క్యాన్సర్‌ ముప్పు
అధ్యయనం ప్రకారం, తక్కువ టీ తాగే వారి కంటే రోజువారీ అవసరానికి మించి టీ తాగేవారిలో రొమ్ము క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.
నిద్రలేమికి కారణం అవుతుంది
టీ ఎక్కువ సార్లు తీసుకోవడం వల్ల మీ నిద్ర సైకిల్‌కు భంగం కలిగే అవకాశం ఉంది. టీలో ఉండే కెఫిన్‌ ఇది మెలటోనిన్ అనే హార్మోన్ చర్యను అడ్డుకుంటుంది. మెలటోనిన్‌ మెదడుకు విశ్రాంతి ఇస్తుంది. దీని కారణంగా నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంది.
ప్రెగ్నెన్సీ టైమ్‌లో సమస్యలు వస్తాయ్‌.
గర్భధారణ సమయంలో టీ ఎక్కువగా తీసుకోవడం తల్లి, బిడ్డ ఆరోగ్యానికి హానికరం. వాస్తవానికి, ఇందులో కెఫీన్ ఉంటుంది. ఇది గర్భస్రావం, పిల్లల తక్కువ బరువుతో పుట్టేలా చేస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో టీ తక్కువగా తీసుకోవడం మంచిది.
ఎంత టీ తాగొచ్చు..
టీ మితంగా తాగితే.. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ, మీరు లిమిట్‌ లేకుండా తాగితేనే.. ఆరోగ్యంపై ప్రతికూల ప్రబావాలను చూపుతుంది. హార్వర్డ్ ప్రకారం, రోజుకు 2-3 కప్పుల టీ అకాల మరణం, గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.