భూమిపై ఎక్కువ వర్షాలు పడే ప్రాంతాలు ఇవే!

హయ్యెస్ట్ రెయిన్ ఫాల్
ప్రస్తుతం తెలుగురాష్ట్రాల్లో చినుకులు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాల ఎంట్రీతో చాలాచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సందర్భంగా అసలు భూమిపై ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్లేసుల గురించి తెలుసుకుందామా!
ఇండియాలోనే టాప్ 2
ప్రపంచంలో ఎక్కువగా వర్షాలు పడే ప్రాంతాల్లో టాప్ 2 ఇండియాలోనే ఉన్నాయి. అందులో మొదటిది మేఘాలయలోని మాసిన్రామ్. దీన్ని ‘వెట్టెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్’ అంటారు. ఇక రెండో ప్లేస్‌లో చిరపుంజీ ఉంది. ఇక్కడ ఏడాది పొడవునా చినుకులు పడుతూనే ఉంటాయి.
టుటునెండో
కొలంబియా దేశంలోని టుటునెండో ప్రాంతంలో ఏడాది పొడవునా వర్షపాతం నమోదవుతూనే ఉంటుంది. భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడంతోపాటు అడవులు కూడా ఎక్కువగా ఉండడంతో ఇక్కడ వర్షాలు ఎక్కువ.
క్రాప్ రివర్
న్యూజిలాండ్‌లో ఉన్న క్రాప్ రివర్ పరిసర ప్రాంతాల్లో ఎప్పుడూ వర్షాలు కురుస్తూనే ఉంటాయి. ఈ ప్రాంతం భౌగోళిక పరిస్థితుల కారణంగా ఇక్కడ గాలులు ఎక్కువగా వీస్తాయి. దాంతో ఇక్కడ ఎప్పుడూ మేఘాలు కమ్ముకుని ఉంటాయి.
హువాయి ఐలాండ్స్
అమెరికాకు చెందిన హువాయి ఐలాండ్స్‌లో కూడా అక్కడక్కడా ఏడాది పొడవునా వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. సముద్రం మీదుగా వీచే గాలులు ఇక్కడి పర్వతాలకు తాకి మబ్బులను వర్షాలుగా మారుస్తుంటాయి.
ఇమైషాన్
చైనాలో సించువాన్ ప్రావిన్స్‌లో ఉన్న ఇమైషాన్ అనే కొండపై ఎప్పుడూ వర్షాలు పడుతూనే ఉంటాయి. ఈ కొండ మేఘాలకు దగ్గరగా ఉండడంతో ఇక్కడ ఎప్పుడూ తేమగా ఉంటుంది.
లంబసింగి
ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వర్షాలు పడే ప్రాంతం లంబసింగి. అరకులోయకు దగ్గర్లో ఉండే ఈ ప్రాంతం ఎప్పుడు చూసినా పచ్చగా, మబ్బులు పట్టి ఉంటుంది.