స్టడీస్‌ కోసం అబ్రాడ్ వెళ్తున్నారా? ఇవి తెలుసుకోండి!
తిరిగి పంపకుండా..
పై చదువుల కోసం విదేశాలకు వెళ్లే ట్రెండ్ ఇటీవల కాలంలో ఎక్కువైంది. అయితే ఇలా వెళ్తున్న వాళ్లలో చాలామంది ఎయిర్‌‌పోర్ట్ నుంచే తిరిగి వెనక్కి వచ్చేస్తున్నారు దానికి కారణం కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడమే.
జాగ్రత్తలు ఇలా..
విదేశాలకు వెళ్లేవాళ్లు తమ వ్యక్తిగత సోషల్ మీడియా పోస్టుల నుంచి ఆరోగ్యపు అలవాట్ల వరకూ కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. లేకపోతే ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ దగ్గర ఎంట్రీ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
సోషల్ మీడియా
విదేశాల్లో చదువుకోవాలనునే వాళ్లు సోషల్‌మీడియాలో పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. విద్వేషాలు పెంచే పోస్టులు, హేట్ స్పీచ్‌ల వంటివి పోస్ట్ చేసినా, లైక్ చేసినా ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్‌లో రిజక్ట్ అయ్యే అవకాశం ఉంది.
పార్ట్ టైం జాబ్స్
ఇమ్మిగ్రేషన్‌ ప్రాసెస్‌లో అధికారులు మొబైల్ చెక్ చేసినప్పుడు గూగుల్, యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో పార్ట్ టైం జాబ్స్ వెతికినట్టు తెలిస్తే.. ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎంట్రీని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది.
ఫేక్ సర్టిఫికేట్లు
టోఫెల్‌, ఐఈఎల్‌టీఎస్, పీటీఈ వంటి సర్టిఫికెట్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఫేక్‌వి పెట్టకూడదు. అక్కడి సిబ్బంది క్రాస్ చెక్ చేసి సర్టిఫికేట్లునకిలీవని గుర్తిస్తే వీసా రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది.
డ్రగ్స్
చదువుల కోసం విదేశాలకు వెళ్లేటప్పుడు కొన్న దేశాల్లో క్షుణ్ణంగా బాడీ చెకప్ చేస్తారు. అందులో గతంలో ఎవైనా డ్రగ్స్ తీసుకున్నట్టు ఆనవాళ్లు దొరికితే ఎంట్రీ రిజెక్ట్ చేస్తారు. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
రేసిజం
విదేశాలకు వెళ్లేవాళ్లు తమ ఫోన్లలో గానీ, ఫోన్ యాప్స్‌లో గానీ మరెక్కడా జాతి, లింగ వివక్షకు తావునిచ్చే ఫొటోలు లేదా పోస్టులు ఉండకుండా చూసుకోవాలి. అలాగే కులం, మతం, ప్రాంతీయ తత్వంపై కూడా పోస్టులు ఉండకూడదు.