ఘనంగా పరిణీతి చోప్రా - రాఘవ్ చద్దా నిశ్చితార్థ వేడుక, నెట్టింట్లో ఫోటోలు వైరల్‌

ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంట్ సభ్యుడు రాఘవ్ చద్దా, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. శనివారం రాత్రి సెంట్రల్ ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో ఈ వేడుక జరిగింది.
రాఘవ్-పరిణీతిల నిశ్చితార్థ వేడుకకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కాంగ్రెస్ నేత పీ చిదంబరం, శివసేన(యూబీటీ) నేత ఆదిత్య థాక్రే, తృణమూల్ కాంగ్రెస్ నేత డెరిక్ ఓబ్రెయిన్ తదితరులు హాజరయ్యారు.
దాదాపు 150 మంది అతిథుల స‌మ‌క్షంలో ఈ వేడుక‌ ఘ‌నంగా జ‌రిగింది. రాఘ‌వ్ చ‌ద్దా పంజాబ్‌కు చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు.
సోదరి నిశ్చితార్థ వేడుకలో పాల్గొనేందుకు శనివారం ఉదయమే అమెరికా నుంచి వచ్చారు ప్రియాంక.
పసుపు రంగు చీరలో ప్రియాంక చోప్రా మెరిసిపోయారు.
ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలియ‌జేస్తున్నారు.