ఒప్పో ఎఫ్23 5జీ విడుదల తేదీ, స్పెషిఫికేష‌న్స్‌, ఫీచర్లు.. ఫోన్‌ ధర ఎంతంటే?

ఒప్పో ఎఫ్23 5జీ లాంచ్ వివరాలు
మే 15వ తేదీన ఒప్పో ఎఫ్23 5జీ మొబైల్‍ను లాంచ్ చేయనున్నట్టు ఒప్పో వెల్లడించింది. అదే రోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ప్రీ-బుకింగ్స్ చేసుకోవ‌చ్చు.
డిస్‍ప్లే
ఒప్పో ఎఫ్23 5జీ ఫోన్‍లో 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (2400x1080 పిక్సెల్స్‌) డిస్‌ప్లే ఉంటుంది.
ప్రాసెసర్
ఒప్పో ఎఫ్23 5జీ ఫోన్‍లో క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగ‌న్ 695 ఎస్వోసీ ప్రాసెస‌ర్ తో వ‌స్తుంది. ఆండ్రాయిడ్ 13 వ‌ర్ష‌న్ విత్ 3.5 ఎంఎం ఆడియో జాక్‌పై ప‌ని చేస్తుంది.
బ్యాటరీ
ఒప్పో ఎఫ్23 5జీ ఫోన్‍లో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ, 67 వాట్ల సూప‌ర్ వూక్ చార్జింగ్ స‌పోర్ట్‌తో వ‌స్తుంది.
కెమెరా
ట్రిపుల్ రేర్ కెమెరా సెట‌ప్ ఇన్ టూ స‌ర్క్యుల‌ర్ మాడ్యూల్స్‌లో వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. 64-మెగా పిక్సెల్ మెయిన్ సెన్స‌ర్‌, 2-మెగా పిక్సెల్ మొనోక్రోమ్‌, 2-మెగా పిక్సెల్ మైక్రో లెన్స్ కెమెరా, 32-మెగా పిక్సెల్స్ సెల్ఫీ కెమెరా ఉండొచ్చున‌ని తెలుస్తుంది.
ధ‌ర
ఒప్పో ఎఫ్23 5జీ ఫోన్ ధ‌ర రూ.28,999లోపు ఉండొచ్చున‌ని వార్తా క‌థ‌నాలు చెబుతున్నాయి.
స్టోరేజీ
8 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ కెపాసిటీ క‌లిగి ఉంటుంది. 8జీబీ రామ్ విస్త‌ర‌ణ ఫీచ‌ర్ కూడా ఉంటుంది.
క‌ల‌ర్స్‌
కూల్ బ్లాక్, బోల్డ్ గోల్డ్ క‌ల‌ర్స్‌లో ఫోన్ ఆవిష్క‌రిస్తార‌ని తెలుస్తున్న‌ది.