ప్రపంచంలో డేంజరస్ టూరిస్ట్ ప్లేసులు ఇవే!

థ్రిల్లింగ్ అడ్వెంచర్ స్పాట్స్
మీకు సాహసాలు చేయడం ఇష్టమా? అయితే భూమిపై ఉన్న అత్యంత ప్రమాదకరమైన అడ్వెంచర్ టూర్స్ గురించి తెలుసుకోవాల్సిందే. ప్రపంచంలో మోస్ట్ థ్రిల్లింగ్ అడ్వెంచర్ టూర్స్ ఏవంటే.
డెత్ వ్యాలీ
యూఎస్ఏలో ఉన్న డెత్ వ్యాలీ.. ప్రపంచంలోని డేంజరస్ డెస్టినేషన్స్‌లో ఒకటి. ఇక్కడ పగటిపూట ఉష్ణో్గ్రతలు 56 డిగ్రీలు దాటతాయి. ఈ ప్రాంతం మార్స్ గ్రహం లాగా ఎర్రగా మండుతూ ఉంటుంది.
మౌంట్ హువాషాన్
చైనాలోని ‘మౌంట్ హువాషాన్’ అనే పర్వతాన్ని ఎక్కడం అత్యంత కష్టంతో కూడుకున్నది. దీన్ని చేరుకోవాలంటే అత్యంత ఎత్తులో గాలిలో నిర్మించిన సన్నని మార్గాల్లో ప్రయాణించాలి.
కీలోవియా
హవాయి ఐలాండ్స్‌లో ఉన్న కీలోవియా పర్వతం.. ప్రపంచంలోనే మోస్ట్ యాక్టివ్ అగ్ని పర్వతాల్లో ఒకటి. ఇక్కడ ఎప్పుడూ లావా పొంగుతూనే ఉంటుంది. అక్కడి భూమి కూడా ఎప్పుడూ కంపిస్తూనే ఉంటుంది.
అకపుల్కో క్లిఫ్ డైవింగ్
మెక్సికోలో ఉన్న అకపుల్కో క్లిఫ్ డైవింగ్ ప్రపంచంలోని ఎత్తైన డైవింగ్ పాయింట్. ఇక్కడ సుమారు 115 అడుగుల ఎత్తులో నుంచి నీటిలోకి దూకుతుంటారు డైవర్స్.
ట్రోల్‌తుంగా
నార్వేలోని ‘ట్రోల్‌తుంగా పాయింట్’ అత్యంత అందమైన, ప్రమాదకరమైన హిల్‌టాప్. ఇక్కడ కొండకు చివరగా ఉండే పాయింట్ వద్దకు చేరుకోడానికి చాలామంది అడ్వెంచర్ టూరిస్టులు ఇంట్రెస్ట్ చూపుతుంటారు.
మారుమ్ వాల్కనో
ఆస్ట్రేలియాకు ఉత్తరవైపున ఉండే వానువాటు అనే ఐలాండ్స్‌లో ఉండే మారుమ్ వాల్కనో ఎప్పుడూ పొగలు కక్కుతూ ఉంటుంది. ఇక్కడ ఉండే పెద్ద లావా లేక్.. మండుతున్న అగ్నిగోళంలా కనిపిస్తుంది. ఇక్కడికి హెలికాప్టర్ ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది.