ఇండియాలో ఉన్న అందమైన సరస్సులు ఇవే!

లేక్స్ టూరిజం
మనదేశంలో కేరళ నుంచి కశ్మీర్ వరకూ అందమైన సరస్సులు బోలెడు ఉన్నాయి. ముఖ్యంగా మాన్‌సూన్‌లో సరస్సులు మరింత అందంగా ముస్తాబవుతాయి. బోటింగ్, వాటర్ స్పోర్ట్స్‌ను ఎంజాయ్ చేసేవాళ్లు తప్పక విజిట్ చేయాల్సిన సరస్సులు ఇవీ!
వెంబనాడ్ లేక్
కేరళలోని కొచ్చిలో ఉండే వెంబనాడ్ లేక్ ఇండియాలో అతిపెద్ద సరస్సుల్లో ఒకటి. సముద్రపు బ్యాక్ వాటర్స్‌తో ఏర్పడిన ఈ లేక్ 90 కిలోమీటర్ల పొడవు విస్తరించి ఉంటుంది. ఇక్కడ బోటింగ్‌తో పాటు సరస్సుపై హౌజింగ్ బోట్స్‌లో స్టే కూడా చేయొచ్చు.
చిలికా లేక్
ఒడిశాలో ఉన్న చిలికా సరస్సు దేశంలోని అతిపెద్ద కోస్టల్ లేక్. ఇక్కడ బోటింగ్ చేస్తూ రకరకాల వలస పక్షులతో పాటు డాల్ఫిన్స్‌ను కూడా చూడొచ్చు.
దాల్ లేక్
కశ్మీర్‌‌లో ఉన్న దాల్ లేక్ దేశంలోని అందమైన సరస్సుల్లో ఒకటి. ఇది మాన్‌సూన్‌లో ఒకలా, వింటర్‌‌లో మరోలా ముస్తాబవుతుంది. దేశంలో ఎక్కువమంది టూరిస్టులు విజిట్ చేసే సరస్సుల్లో ఇదీ ఒకటి.
సంభార్ లేక్
రాజస్థాన్‌లో ఉన్న సంభార్ లేక్ అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. ఇక్కడ ఎటు చూసినా తెల్లటి ఉప్పు కుప్పలే కనిపిస్తాయి. పలురకాల వలస పక్షులు కూడా ఇక్కడ కనిపిస్తాయి.
చంద్రతాల్ లేక్
హిమాచల్ ప్రదేశ్‌లో ఉండే చంద్రతాల్ లేక్ సముద్ర మట్టానికి 4300 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది దేశంలోని అందమైన సరస్సుల్లో ఒకటి.
లోక్తక్ లేక్
మణిపూర్‌‌లో ఉన్న లోక్తక్ లేక్ దేశంలోనే అతిపెద్ద మంచి నీటి సరస్సు. ఇక్కడుండే స్వచ్ఛమైన నీటిలో బోటింగ్ చేస్తుంటే గాల్లో తేలినట్టుగా కనిపిస్తుంది.