వయసు వారీగా పిల్లలకు ఇవ్వాల్సిన విటమిన్లు!

వయసుని బట్టి..
పిల్లలకు వయసుని బట్టి రకరకాల విటమిన్లు అవసరమవుతాయి. తగిన వయసులో తగిన విటమిన్లు ఇవ్వకపోతే పోషకాహారలోపం సంభవించే అవకాశం ఉంటుంది. ఏయే విటమిన్లు ఏయే వయసుల్లో అవసమవుతాయంటే.
విటమిన్–ఎ
ఐదేళ్ల లోపు వయసున్న పిల్లలకు 400 మై. గ్రా. అలాగే ఐదు నుంచి పదేళ్ల లోపు పిల్లలకు 500 మై.గ్రా. విటమిన్–ఎ తప్పనిసరిగా ఇవ్వాలి. పిల్లల ఎదుగుదలకు రక్త కణాల వృద్ధికి ‘ఎ’ విటమిన్ అత్యంత అవసరం. క్యారెట్లు, పాలు, గుడ్లు, ఆకు కూరల్లో ‘ఎ’ విటమిన్ లభిస్తుంది.
బీ12
మూడు నుంచి ఎనిమిదేళ్ల వయసున్న పిల్లలకు తప్పనిసరిగా రోజుకి 0.6 మై.గ్రా ‘బీ12’ అందాలి. పిల్లల మానసిక ఎదుగుదలకు, ఎముకల ఎదుగుదలకు ఈ విటమిన్ చాలా కీలకం. గుడ్లు, ఆకుకూరలు, పాలు, పెరుగు, బీన్స్ వంటి ఫుడ్స్ ద్వారా ‘బీ12’ విటమిన్ తయారవుతుంది.
విటమిన్–డి
ఏడాది లోపు పిల్లలకు రోజుకి 10 మై.గ్రా. విటమిన్–డి అవసరం. అలాగే 1 నుంచి 14 ఏళ్ల పిల్లలకు 20 మై.గ్రా. విటమిన్–డి అవసరం. పిల్లలు రోజూ కాసేపు ఉదయపు ఎండలో ఆడుకునేలా చూస్తే తగినంత విటమిన్–డి అందుతుంది.
విటమిన్–కె
మూడేళ్ల లోపు పిల్లలకు 30 మై.గ్రా., 14 ఏళ్ల లోపు పిల్లలకు 50 మై.గ్రా. విటమిన్–కె అవసరం. రక్త కణాల వృద్ధికి ఈ విటమిన్ ఎంతో అవసరం. క్యాబేజ్, పాలకూర, బ్రొకలీ, క్యాలీఫ్లవర్ వంటి వాటిలో ఇది లభిస్తుంది.
విటమిన్–ఇ
ఏడాది లోపు పిల్లలకు 5 మి.గ్రా., ఆపైన 6 నుంచి 10 మి.గ్రా. విటమిన్–ఇ అవసరం. మెదడు పెరుగుదలకు ‘ఇ’ విటమిన్ చాలా అవసరం. బాదం, సన్ ఫ్లవర్ సీడ్స్, ఇతర నట్స్‌లో ఇది లభిస్తుంది.
ఇవి కూడా..
ఇక వీటితోపాటు ‘సి’ విటమిన్, ‘బీ’ కాంప్లెక్స్ విటమిన్లు కూడా పిల్లల ఆరోగ్యంలో కీలకం. పండ్లు, ఆకుకూరలు, గోధుమల వంటి వాటి ద్వారా పిల్లలకు పూర్తి పోషకాహారం లభిస్తుంది.