ఒత్తిడిని మాయం చేసే జపనీస్ టెక్నిక్స్!

ఇన్‌స్టంట్ రిలీఫ్
ఒత్తిడి బాగా ఎక్కువైనప్పుడు దాన్నుంచి తక్షణ రిలీఫ్ ఎలా అని చాలామంది ఆలోచిస్తుంటారు. ఇలాంటప్పుడే జపనీస్ టెక్నిక్స్ పనికొస్తాయి. జపనీస్ ట్రెడిషన్స్‌లో భాగమైన ఈ టెక్నిక్స్‌ను ఫాలో అవ్వడం ద్వారా ఒత్తిడి నుంచి వేగంగా బయటపడొచ్చు.
ఫారెస్ట్ బాతింగ్
దగ్గర్లోని పార్క్ లేదా చెట్లు ఉండే ప్రాంతంలో కాసేపు నడవడం లేదా చెట్టుని కౌగిలించుకోవడం ద్వారా ఒత్తిడి మాయమవుతుందని జపనీస్ చెప్తుంటారు. ఈ టెక్నిక్ బీపీని తగ్గించి మూడ్‌ను ఇంప్రూవ్ చేస్తుందని పలు రీసెర్చ్ ల్లో కూడా తేలింది.
జాజెన్
ఇదొక మెడిటేషన్ టెక్నిక్. కళ్లు మూసుకుని మనసులో ఎలాంటి జడ్జిమెంట్ లేకుండా కేవలం శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఇలా ఐదు నిముషాల పాటు చేస్తే.. ఎలాంటి ఒత్తిడైనా చిటికెలో మాయం అవుతుంది.
ఇకెబానా
అందమైన పువ్వులను తెచ్చుకుని వాటితో టేబుల్ లేదా ఫ్లవర్ వేజ్‌ను అందంగా అలకరించుకోవాలి. ఇదే ఇకెబానా టెక్నిక్. పువ్వులను అందంగా అలకిరించడం ద్వారా మనసులో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఒత్తిడి మాయమవుతుందట.
మైండ్‌ఫుల్ వాకింగ్
ఒత్తిడిగా అనిపించినప్పుడు మైండ్‌ఫుల్ వాకింగ్ చేస్తే వెంటనే రిలీఫ్ వస్తుందట. మైండ్‌ఫుల్ వాకింగ్ అంటే అడుగులో అడుగు వేస్తూ ప్రతి అడుగుని గమనిస్తూ మెల్లగా నడవడమే.
ఆక్యుప్రెషర్
ఆక్యుప్రెషన్ అనేది జపనీస్ వైద్య విధానాల్లో ఒకటి. అయితే ఈ విధానంలో ఒత్తిడిని పోగొట్టుకోవడం కోసం అరచేతికి లేదా అరికాలుకి నూనె పూసుకుని మెల్లగా ప్రెషర్ అప్లై చేస్తూ మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే మెదడులోని నరాలు రిలాక్స్ అయ్యి ఒత్తిడి తగ్గుతుంది.
హాట్ బాత్
ఇకపోతే ఒత్తిడిగా అనిపించినప్పుడు వేడి నీటితో స్నానం చేయడం లేదా హాట్ వాటర్ టబ్‌లో కాసేపు ఉండడం చేస్తే వెంటనే స్ట్రెస్ నుంచి రిలీఫ్ వస్తుంది.