ఈ పోషకాలు లోపిస్తే.. బరువు పెరుగుతారు జాగ్రత్త!

మెటబాలిజం తగ్గి..
శరీరంలో మెటబాలిజం కంట్రోల్‌లో ఉంటేనే బరువు అదుపులో ఉంటుంది. మెటబాలిజం సరిగ్గా ఉండాలంటే ముఖ్యంగా కొన్ని పోషకాలు శరీరానికి అందుతూ ఉండాలి. అవి లోపిస్తే హార్మోనల్ ఇంబాలెన్స్ జరిగి బరువు పెరగడం మొదలవుతుంది. అవేంటంటే..
విటమిన్–డి
శరీరంలో విటమిన్–డి లోపిస్తే వెంటనే బరువు పెరుగుతారు. అధికంగా ఉన్న క్యాలరీలను ఖర్చు చేయడానికి, మెటబాలిజం పెరగడానికి విటమిన్–డి అవసరం. అది తగ్గితే వెయిట్ గెయిన్ మొదలవుతుంది. విటమిన్–డి ఎండ నుంచి లభిస్తుంది.
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్
ఆకలిని అదుపులో ఉంచడానికి, హెల్దీ ఫ్యాట్స్ మెయింటెయిన్ అవ్వడానికి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండాలి. ఇవి లేకపోతే ఆకలి పెరిగి బరువు పెరుగుతారు. చేపలు, నట్స్‌లో ఇవి లభిస్తాయి.
ప్రొటీన్స్
శరీరంలో ప్రొటీన్ లోపిస్తే కూడా బరువుపెరుగుతారు. ప్రొటీన్ లేకపోతే మజిల్స్ వీక్‌గా, నీరసంగా అనిపించి ఆకలి పెరుగుతుంది. తద్వారా బరువు పెరిగే అవకాశం ఉంది. ప్రొటీన్స్ కోసం పప్పులు, నట్స్, గుడ్లు, మాంసం తినాలి.
ఐరన్
శరీరంలో ఐరన్ లోపిస్తే అవయవాలకు ఆక్సిజన్ అందే శాతం తగ్గుతుంది. తద్వారా నీరసంగా అనిపిస్తుంది. ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది. ఫలితంగా బరువు పెరిగే అవకాశముంది. ఐరన్ కోసం పండ్లు, కూరగాయలు, నువ్వులు, రాగుల వంటివి తినాలి.
‘బి’ విటమిన్స్
ఆహారం నుంచి శక్తిని శోషించుకోడానికి శరీరంలో ‘బి’ కాంప్లెక్స్ విటమిన్స్ ఉండాలి. ఇవి లేకపోతే ఆకలి పెరిగి ఎక్కువ తినాలనిపిస్తుంది. తద్వారా బరువు పెరిగే ఛాన్స్ ఉంది. ‘బి’ విటమిన్ల కోసం గోధుమలు, ముడి బియ్యం, మిల్లెట్స్ వంటివి తినాలి.
జింక్
ఆహారంగా శక్తిగా మారడానికి మెటబాలిజం ఎక్కువగా ఉండడం అవసరం. శరీరంలో జింక్ లోపిస్తే మెటబాలిజం తగ్గుతుంది. తద్వారా వెంటనే బరువు పెరుగుతారు. జింక్ కోసం మాంసం, నట్స్, ఫ్రూట్స్ తినాలి.