డార్క్ లిప్స్‌ పోవాలంటే.. ఇలా చేయండి!

అందానికి అడ్డంకి
ముఖంపై పెదవులు నల్లగా ఉండడం చాలామందికి ఇబ్బంది పెట్టే సమస్య. ముఖం ఎంత అందంగా ఉన్నా.. పెదవులు నల్లగా ఉంటే ఏదో లోపం ఉన్నట్టు కనిపిస్తుంటుంది.
ఈజీగా తగ్గించొచ్చు
పెదవులు నల్లగా మారడానికి చాలా కారణాలుంటాయి. అయితే కొన్ని సింపుల్ టిప్స్‌తో వాటిని తిరిగి ఎరుపు రంగులోకి మార్చొచ్చు. వాటిలో కొన్ని ఇవి..
నో స్మోకింగ్
స్మోకింగ్ అలవాటున్న చాలామందికి పెదవులు నల్లగా మారుతుంటాయి. ఇలాంటి వాళ్లు కేవలం స్మోకింగ్ మానేయడం ద్వారా తిరిగి పెదవులను సహజమైన రంగులోకి మార్చుకోవచ్చు.
హెర్బల్ టీ
కొంతమందికి కాఫీ, టీలు తాగడం వల్ల పెదవులు నల్లబడుతుంటాయి. అలాంటి వాళ్లు తేయాకుతో చేసిన టీ కాకుండా గ్రీన్ టీ, లెమన్ టీ లేదా హెర్బల్ టీలు తాగడం మంచిది.
సిట్రస్ ఫ్రూట్స్‌తో..
శరీరంలో విటమిన్–సీ లోపించడం వల్ల కూడా పెదవులు నల్లబడతాయి. కాబట్టి డార్క్ లిప్స్ ఉన్నవాళ్లు.. డైట్‌లో సిట్రస్ ఫ్రూట్స్ చేర్చుకుంటే సమస్య తగ్గొచ్చు.
నీళ్లు తాగాలి
పెదవులు సహజమైన రంగులో ఉండాలంటే శరీరానికి హైడ్రేషన్ ముఖ్యం. కాబట్టి తగినంత నీళ్లు తాగుతుండడం వల్ల పెదవులు తేమగా, సహజమైన రంగులో ఉంటాయి.
కెమికల్స్ వద్దు
ఇక వీటితోపాటు కెమికల్స్‌తో కూడిన లిప్‌స్టిక్‌లు, లిప్ బామ్స్ వల్ల కూడా పెదవులు నల్లబడతాయి. కాబట్టి వీలైనంత నేచురల్ ప్రొడక్ట్స్‌నే వాడాలి. అలాగే నల్లటి పెదవులకు తేనేలో నిమ్మరసాన్ని కలిపి అప్లై చేయడం ద్వారా సమస్యను తగ్గించుకోవచ్చు.