హిమాలయాల అందాలు చూడ్డానికి వింటర్ అనువైన సీజన్. హిల్ స్టేషన్స్, స్నో ఫాల్స్, పర్వతాల వంటివి ఇష్టపడేవాళ్లు ఈ సీజన్‌లో తప్పక విజిట్ చేయాల్సిన ప్లేస్‌లు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..
లడాఖ్
పర్వతాలు, పర్వత లోయలతో పాటు రోడ్ అడ్వెంచర్స్‌ను ఇష్టపడేవాళ్లు నవంబర్, డిసెంబర్ నెలల్లో లడాఖ్ టూర్ వేయాల్సిందే. ఈ సీజన్‌లో ఇక్కడి పర్వతాలు, లోయలు మంచు కప్పుకుని అందంగా ముస్తాబవుతాయి. టెంపరేచర్స్ మైనస్ డిగ్రీలకు పడిపోతాయి.
తవాంగ్
హిల్ స్టేషన్స్, జలపాతాలు, పచ్చని కొండలను ఇష్టపడేవాళ్లు అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌కు వెళ్లొచ్చు. అందమైన నదులు, జలపాతాలతో పాటు పొగమంచుతో కప్పబడిన కొండలు, బౌద్ధ మొనాస్ట్రీలను ఇక్కడ విజిట్ చేయొచ్చు.
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్
ఉత్తరాఖండ్ లోని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్.. స్వర్గాన్ని తలపిస్తుంది. అచ్చంగా పూలతో కప్పబడి ఉండే ఈ వ్యాలీ యునెస్కో హెరిటేజ్ సైట్స్‌లో ఒకటి. ఈ సీజన్‌లో ఇక్కడ రష్ తక్కువగా ఉంటుంది.
డార్జిలింగ్
ఎత్తైన కొండల మీద అందమైన టీ తోటల మధ్య దూరంగా హిమాలయాలను చూస్తూ వెచ్చని కాఫీ తాగాలంటే వెస్ట్ బెంగాల్‌లోని డార్జిలింగ్‌కు వెళ్లాల్సిందే. ఇండియాలోని బెస్ట్ హనీమూన్ స్పా్ట్స్‌లో ఇదీ ఒకటి.
షిమ్లా
ఇండియాలోని మోస్ట్ విజిటెడ్ హిల్ స్టేషన్స్ లో షిమ్లా ఒకటి. చల్లని క్లైమెట్, మంచు కప్పుకున్న చెట్లు, ఇళ్లతో కూడిన అందమైన సిటీని చూడాలంటే వింటర్‌లో ఒక్కసారైనా షిమ్లా వెళ్లాల్సిందే.
ఆలి
వింటర్‌లో స్నో యాక్టివిటీస్ చేయాలనుకుంటే ఉత్తరాఖండ్‌లో ఉన్న ఆలికి వెళ్లాలి. మంచు మైదానాలకు ఈ ప్లేస్ ఫేమస్. ఎటు చూసిన తెల్లటి పర్వతాలు, మైదానాలు విజటర్స్‌ను కట్టి పడేస్తాయి.