బరువు తగ్గడం కోసం హెల్దీ స్నాక్స్!

స్నాక్స్ మానకుండా..
మెయిన్ మీల్‌తో సంబంధం లేకుండా ఖాళీ సమయాల్లో స్నాక్స్ వంటివి తింటుంటారు చాలామంది. ఈ అలవాటుతో బరువు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ చాలామంది దీన్ని మానుకోలేరు. అందుకే ఇలాంటి వాళ్లు స్నాక్స్‌ను ఇలా ప్లాన్ చేసుకోవాలి.
నట్స్
ఏదో ఒకటి తినాలనిపించినప్పుడు ఏది పడితే తినకుండా హెల్దీ ఆప్షన్స్‌ను ఎంచుకోవడం ద్వారా బరువు పెరగకుండా జాగ్రత్తపడొచ్చు. ముఖ్యంగా స్నాక్స్ టైంలో వేగించిన నట్స్‌ను తీసుకోవడం ద్వారా ఎలాంటి నష్టం ఉండదు.
డార్క్ చాక్లెట్
ప్రయణాల్లో లేదా ఆఫీసులోని ఖాళీ టైంలో ఏదైనా తినాలనిపించినప్పుడు డార్క్ చాక్లెట్ తినేయొచ్చు. ఇది రుచిగా ఉండడంతో పాటు శరీరానికి మంచి యాంటీ ఆక్సిడెంట్స్‌ను అందజేస్తుంది.
ఉడికించిన పప్పులు
సాయంత్రం వేళల్లో స్నాక్స్ తినాలనిపించినప్పుడు నానెబెట్టి ఉడికించిన శెనగలు, పల్లీల వంటివి తినొచ్చు. వాటిపై ఉప్పు, కారం, కొత్తిమీర చల్లి నిమ్మరసం కలిపితే ఇంకా బాగుంటుంది. పైగా హెల్దీ కూడా.
సలాడ్
బ్రేక్ టైంలో జంక్ ఫుడ్ తినే అలవాటున్నవాళ్లు వాటికి బదులుగా ఫ్రూట్ సలాడ్‌ను ఎంచుకుంటే చాలా త్వరగా బరువు తగ్గొచ్చు. పైగా ఫ్రూట్స్ తినడం ద్వారా ఆకలి కూడా తగ్గుతుంది.
మొలకలు
ఖాళీ సమయాల్లో తినేందుకు మొలకలు కూడా బెస్ట్ ఆప్షన్. వీటిలో కొన్ని క్యారెట్ ముక్కలు కలుపుకుని బాక్స్‌లో పెట్టుకుని ఆఫీస్‌కు కూడా తీసుకెళ్లొచ్చు. తినాలనిపించినప్పుడల్లా కొన్ని నోట్లో వేసుకోవచ్చు.
ఇవి కూడా..
టైం పాస్‌గా స్నాక్స్ తింటూనే బరువు పెరగకూడదంటే.. మరమరాలు, అటుకులు, క్వినోవా, ఓట్స్‌తో చేసిన స్నాక్స్‌ను ఎంచుకోవాలి. వీటిలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. కాబట్టి బరువు పెరిగే అవకాశం తక్కువ.