డైట్‌లో తప్పక ఉండాల్సిన ఆరు ఫ్యాట్స్!

ఫ్యాట్స్ ముఖ్యమే
బరువు పెరుగుతామనే భయంతో కొవ్వు పదార్థాలను దూరం పెడుతుంటారు చాలామంది. అయితే గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు, హార్మోన్ల బ్యాలెన్స్‌కు మంచి కొవ్వులు అవసరం అంటున్నారు డాక్టర్లు. కాబట్టి ఈ ఆరు రకాల కొవ్వుల్లో ఒకదాన్ని డైట్‌లో చేర్చుకోండి!
ఆవకాడో
హెల్దీ ఫ్యాట్స్ అందించే ఏకైక ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది ఆవకాడోనే. ఇందులో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి.
ఆలివ్ ఆయిల్
కూరలకు వాడుకోదగ్గ మంచి నూనెల్లో ఆలివ్ నూనె ఒకటి. ఇందులో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి హార్ట్ హెల్త్‌కు, డయాబెటిస్ మంచివి.
నట్స్
ఎలాంటి భయం లేకుండా తీసుకోదగ్గ హెల్దీ ఫ్యా్ట్స్‌లో నట్స్ ముందుంటాయి. రోజుకు కొన్ని బాదం పప్పులు, వాల్నట్స్, పిస్తా వంటివి తీసుకుంటే విటమిన్లు, మినరల్స్‌తో పాటు మంచి కొవ్వులు కూడా శరీరానికి అందుతాయి.
చేపలు
రుచితో కూడిన హెల్దీ ఫ్యాట్స్‌ను తీసుకోవాలంటే చేపలు బెస్ట్ ఆప్షన్. చేపల్లో మంచి కొవ్వులతో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవి మెదడు, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
కొబ్బరి
కొబ్బరిలో మంచి కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరంలో సులభంగా జీర్ణమవ్వడమే కాకుండా బరువు తగ్గడంలో సాయపడతాయి. కొబ్బరిని నేరుగా లేదా పాలు, స్వీట్ల రూపంలో తీసుకోవచ్చు.
పెరుగు
పెరుగు, నెయ్యి వంటి పదార్థాలను కూడా హెల్దీ ఫ్యాట్స్‌గా చెప్పుకోవచ్చు. వీటిలో మంచి కొవ్వులతోపాటు క్యాల్షియం, ప్రొటీన్స్ కూడా ఉంటాయి.