ఈ అలవాట్లుంటే లాంగ్‌టర్మ్‌లో నష్టపోతారు!

వీటితో ప్రమాదం
ఫుడ్, లైఫ్‌స్టైల్, వర్క్.. వంటి పలు విషయాల్లో తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల దీర్ఘకాలంలో నష్టపోవాల్సివస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అతిగా పనిచేయడం
ఎక్కువ సంపాదించాలని లేదా గోల్ రీచ్ అవ్వాలని.. ఇలా చాలామంది పని గంటలకు మించి పని చేస్తుంటారు. రోజుకి పది గంటల కంటే ఎక్కువగా పని చేయడం ద్వారా లాంగ్ టర్మ్‌లో ఒత్తిడి, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
చిరు తిండి
రోజువారీ డైట్‌లో చిప్స్, పిజ్జాలు, కూల్‌డ్రింక్స్.. ఇలా చిరుతిళ్లను ఎక్కువగా తినేవాళ్లు లాంగ్‌టర్మ్‌లో నష్టపోక తప్పదని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి గుండెపోటు, కొలెస్ట్రాల్, బీపీ రిస్క్‌లను పెంచుతాయి.
పోశ్చర్
రోజంతా కూర్చొని పనిచేసేవాళ్లు సరైన పోశ్చర్‌‌ను మెయింటెయిన్ చేయకపోవడం వల్ల వయసు పైబడే కొద్దీ దాని ఎఫెక్ట్ కొద్దికొద్దిగా బయటపడుతూ వస్తుంది. డిస్క్ సమస్యలు, వెన్ను నొప్పి, మెడ నొప్పి వంటివి వచ్చే అవకాశం పెరుగుతుంది.
మెడిసిన్స్
ప్రతి చిన్న సమస్యకు మందులు వాడడం, పెయిన్ కిల్లర్స్, యాంటీ బయాటిక్స్‌ను తరచూ వాడడం వల్ల అలవాటు వల్ల దీర్ఘకాలంలో శరీరం రెసిస్టెన్స్‌ను సంతరించుకుంటుంది. ఫలితంగా ట్రీట్మెంట్లకు లొంగని విధంగా శరీరం తయారవుతుంది.
ఎమోషన్స్
ఎమోషన్స్‌ను అదుపులో ఉంచుకోకపోవడం వల్ల కూడా లాంగ్‌టర్మ్‌లో నష్టపోవాల్సి వస్తుంది. అతిగా కోప్పడడం, అతిగా బాధపడడం వంటి అలవాట్లు.. వయసు పైబడే కొద్దీ మానసిక సమస్యలు తలెత్తేలా చేస్తాయి.
ఫిజికల్ యాక్టివిటీ
ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఎండకు ఎక్స్‌పోజ్ అవ్వకపోవడం వంటి అలవాట్ల వల్ల ప్రస్తుతానికి నష్టం తెలియకపోయినా వయసు పైబడే కొద్దీ హాని పెరుగుతుంటుంది. ఒబెసిటీ, కీళ్లనొప్పులు, డయాబెటిస్ వంటి సమస్యల రిస్క్ పెరుగుతుంది.