రోజూ మొలకలు తింటే జరిగేది ఇదే!

మైక్రో న్యూట్రియెంట్స్
మొలకలను సూపర్ ఫుడ్స్ అంటుంటారు. ఎందుకంటే ఇందులో శరీరానికి కావల్సిన అన్ని పోషకాలు మైక్రో లెవల్‌లో అందుబాటులో ఉంటాయి. వీటిని రోజూ తినడం ద్వారా ఎలాంటి పోషకాహార లోపం లేకుండా చూసుకోవచ్చు.
డైజెషన్
మొలకల్లో అన్నిరకాల విటమిన్లు, మినరల్స్‌తోపాటు పీచు పదార్థాలు, ఫోలేట్, ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి.
రక్త ప్రసరణ
మొలకల్లో ఉండే మైక్రో న్యూట్రియెంట్స్ రెడ్ బ్లడ్ సెల్స్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. తద్వారా ఐరన్ లోపం ఉండదు. రక్తప్రసరణ వ్యవస్థ హెల్దీగా ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఇమ్యూనిటీ
మొలకలు రోజూ తింటే ఇమ్యూనిటీకి ఢోకా ఉండదు. ఇందులో ఉండే మల్టిపుల్ న్యూట్రియెంట్స్ ఓవరాల్ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. తద్వారా సాధారణ ఇన్ఫెక్షన్స్ దరి చేరవు.
చర్మ ఆరోగ్యం
మొలకల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. తద్వారా చర్మం ఎప్పుడూ తాజాగా ఉంటుంది. మొటిమలు, ముడతల వంటి చర్మ సమస్యలు త్వరగా తగ్గిపోతాయి.
తయారీ ఇలా
పెసలు, వేరుశెనగలు, శెనగలు, మిల్లెట్స్ వంటి గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయం కాటన్ క్లాత్‌లో చుట్టి పెట్టాలి. ఇలా ఒక రోజంతా వదిలేస్తే గింజలకు మొలకలు వస్తాయి.
ఇలా తినొచ్చు
మొలకలను నేరుగా తీసుకోవచ్చు లేదా ఫ్రూట్ సలాడ్స్‌లో కలుపుకోవచ్చు. అలాగే మొలకలను గ్రైండ్ చేసి దోసెలు కూడా పోసుకోవచ్చు.