బుల్లెట్ ప్రూఫ్ కాఫీతో బొలెడు బెనిఫిట్స్!

చాలా స్పెషల్
కాఫీల్లో కోల్డ్ కాఫీ, బ్లాక్ కాఫీ, చాక్లెట్ కాఫీ.. ఇలా చాలారకాలున్నాయి. కానీ, వేగంగా బరువు తగ్గించి, స్కిన్‌ను తాజాగా ఉంచే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ మాత్రం చాలా ప్రత్యేకం. సెలబ్రిటీలు ఎక్కువగా తాగే ఈ కాఫీని ఎలా చేయాలంటే..
ఇలా చేయాలి
కాఫీ పొడితో కప్పు కాఫీ రెడీ చేసి అందులో టేబుల్ స్పూన్ మీడియం చెయిన్ ట్రైగ్లిజరైడ్(MCT) నూనె కలపాలి. తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా ప్లాంట్ బేస్డ్ బట్టర్ కలపాలి. ఆ మిశ్రమాన్ని నురుగు వచ్చేంతవరకూ తిప్పితే బుల్లెట్ కాఫీ రెడీ.
కొలెస్ట్రాల్ మాయం
కాఫీలో నెయ్యి కలిపి పరగడుపున తాగితే.. చెడు కొలెస్ట్రాల్ కరిగి, మంచి కొలెస్ట్రాల్ పెరిగుతుంది. డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఆకలి తగ్గి బరువు కూడా తగ్గుతారు.
డయాబెటిస్ దూరం
బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగడం ద్వారా ఇన్సులిన్ రిలీజ్ స్లో అవుతుంది. తద్వారా షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా ఈ కాఫీ తాగొచ్చు.
హార్మోనల్ బ్యాలెన్స్
హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే సమస్యలకు బుల్లెట్ కాఫీతో చెక్ పెట్టొచ్చు. అంతేకాదు, ఆడవాళ్లలో వచ్చే పీసీఓడీ, పీసీఓఎస్ వంటి సమస్యలను కూడా ఇది నియంత్రింస్తుంది.
హెల్దీ స్కిన్
నెయ్యిలో ఉండే ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా6 ఫ్యాటీ యాసిడ్స్.. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. తద్వారా చర్మం కాంతివంతంగా తయారవుతుంది. సెలబ్రిటీలు ఈ కాఫీ తాగడం వెనుక సీక్రెట్ ఇదే.
జాగ్రత్తలు ఇలా
బుల్లెట్ కాఫీని పరగడుపున మాత్రమే తాగాలి. రాత్రిళ్లు ఈ కాఫీ తాగడం వల్ల నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ కాఫీని రోజుకి ఒకసారి తీసుకుంటే చాలు.