జలుబు, జ్వరంగా ఉన్నప్పుడు తినాల్సిన ఫుడ్స్ ఇవే..

ఇమ్యూనిటీ ఫుడ్స్
వర్షాకాలంలో సహజంగానే ఇమ్యూనిటీ తగ్గుతుంది. అందుకే ఈ సీజన్‌లో జలుబు, ఫ్లూ వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ సీజన్‌లో ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే డైట్‌లో ఈ ఫుడ్స్ తప్పక చేర్చుకోవాలి. అవేంటంటే..
తేనె
తేనే మంచి యాక్టీబ్యాక్టీరియాగా పని చేస్తుంది. ఇది ఇమ్యూనిటీని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జలుబు, జ్వరాలు ఉన్నప్పుడు గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకుని తాగితే మంచిది.
సిట్రస్ ఫ్రూట్స్
ఇమ్యూనిటీ పెరగాలంటే విటమిన్–సి చాలా అవసరం అని మనకు తెలిసిందే. కాబట్టి ఈ సీజన్‌లో సిట్రస్ ఫ్రూట్స్‌ను తప్పక తీసుకోవాలి. ఇవి రోజూ తింటూ ఉంటే జలుబు, జ్వరాలు దరిచేరవు.
అల్లం
ఇన్ఫెక్షన్లతో పోరడటానికి అల్లం బాగా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా శ్వాస సమస్యలు, జలుబు, దగ్గు ఉన్నవాళ్లు అల్లంతో చేసిన టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది.
పెరుగు
వర్షాకాలంలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు పెరుగుతుంటాయి. రోజువారీ ఆహారంలో పెరుగు తీసుకోవడం ద్వారా పొట్టలో చేరిన ఆ క్రిములను నశింపజేయొచ్చు. పెరుగులో ఉండే ప్రొబ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియాను తగ్గిస్తుంది.
బొప్పాయి
బొప్పాయి మంచి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగిన పండు. వర్షాకాలంలో జ్వరంగా అనిపించినప్పుడు బొప్పాయి తింటే జ్వరం నుంచి శరీరం త్వరగా కోలుకుంటుంది.
ఆకు కూరలు
వర్షాకాలంలో ఆకుకూరలు ఎక్కువగా తినడం ద్వారా పోషకాల లోపం లేకుండా చూసుకోవచ్చు. ఈ సీజన్‌లో ఎక్కువగా దొరికే ఆకుకూరలు రోజూ తింటుంటే శరీరానికి కావల్సిన విటమిన్లు, మినరల్స్ చక్కగా అందుతాయి.