ఆడవాళ్ల డైట్‌లో ఇవి తప్పక ఉండాలి!

బ్యాలెన్స్‌డ్ న్యూట్రిషన్
వయసు వారీగా ఆడవాళ్లలో కొన్ని సాధారణ సమస్యలు తలెత్తుతుంటాయి. వాటిని నివారించాలంటే కొన్ని ముఖ్యమైన పోషకాలను డైట్‌లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటంటే..
కాల్షియం
వయసు పెరిగేకొద్దీ ఆడవాళ్లలో కీళ్ల సమస్యలు ఎక్కువవుతుంటాయి. దాన్ని నివారించాలంటే ప్రతిరోజూ కాల్షియం తీసుకోవడం ముఖ్యం. దీనికోసం పాలు, ఆకుకూరలు, నువ్వులు తీసుకోవాలి.
ఐరన్
మనదేశంలో ఐరన్ లోపంతో బాధపడుతున్న ఆడవాళ్ల సంఖ్య ఎక్కువ. ఈ లోపాన్ని సరిచేయాలంటే ప్రతిరోజూ డైట్‌లో బెల్లం, నట్స్, ఖర్జూరం, రాగులు, బీట్‌రూట్ వంటివి చేర్చుకోవాలి.
ఫోలేట్
ఆడవాళ్లలో గర్భధారణ సమస్యలు రాకుండా ఉండాలంటే తినే ఆహారంలో ఫోలేట్(విటమిన్–బి9) ఉండేలా చూసుకోవాలి. దీనికోసం ఆకుకూరలు, సిట్రస్ ఫ్రూట్స్, పప్పు ధాన్యాలు, పెరుగు వంటివి తీసుకోవచ్చు.
ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్స్
గుండె, మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మహిళలు ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫుడ్స్ తప్పక తీసుకోవాలి. వీటికోసం చేపలు, ఫ్లాక్స్ సీడ్స్, బాదం, వాల్నట్స్, చియా సీడ్స్ వంటివి తీసుకోవచ్చు.
విటమిన్–డీ
ఇళ్లలోనే ఎక్కువగా ఉండే హౌజ్ వైవ్స్‌లో విటమిన్–డీ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి హౌస్ వైవ్స్ రోజూ ఇరవై నిముషాలు ఎండ తగిలేలా చూసుకోవాలి. దీంతోపాటు పాలు, చేపలు, నట్స్ వంటివి తీసుకోవాలి.
జింక్
ఆడవాళ్లలో ఇమ్యూనిటీ పెరగడానికి ఇంఫ్లమేషన్ తగ్గడానికి శరీరంలో జింక్ తప్పనిసరిగా ఉండాలి. దీనికోసం పాలు, నట్స్, ముడి ధాన్యాల వంటివి తీసుకోవచ్చు.