క్యాన్సర్ వచ్చేముందు కనిపించే లక్షణాలివే

ముందే గుర్తిస్తే..
ప్రపంచంలో ఎక్కువ మంది ప్రాణాలు తీస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ ముందు వరుసలో ఉంటుంది. అయితే అత్యంత ప్రమాదకరమైన ఈ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తిస్తే దాన్నుంచి కోలుకునే అవకాశం ఉంటుంది.
ముఖ్యమైన లక్షణాలు
క్యాన్సర్ రోగుల్లో చాలామంది పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన కొన్ని ముఖ్యమైన లక్షణాలను అమెరికన్ క్యాన్సర్ సొసైటీ లిస్ట్ చేసింది. అవేంటంటే..
వెయిట్ లాస్
శరీరంలో క్యానర్ ఉంటే ఒకానొక టైంలో బాగా బరువు తగ్గిపోతారు. ఇది క్యాన్సర్ ప్రధానమైన లక్షణాల్లో ఒకటి. పాంక్రియాస్, పొట్ట, ఊపిరితిత్తులు, పేగు క్యాన్సర్లు వచ్చేముందు వెయిట్ లాస్ తప్పక కనిపిస్తుంది.
అలసట
క్యాన్సర్ లక్షణాల్లో అలసట కూడా ముఖ్యమైనది. క్యాన్సర్ పెరుగుతున్నప్పుడు కనిపించే ప్రధాన లక్షణం ఇది. రెస్ట్ తీసుకున్నా, పోషకాహారం తీసుకుంటున్నా అలసట వేధిస్తుంటే అది క్యాన్సర్ లక్షణం కావొచ్చు.
గాయాలు మానకపోతే..
చిన్నచిన్న గాయాలు కూడా ఎక్కువ కాలం పాటు మానకపోతుంటే అది క్యాన్సర్ లక్షణం కావొచ్చు. ఏదైనా గాయం నాలుగు వారాల కంటే ఎక్కువ కాలం వేధిస్తుంటే తగిన పరిక్షలు చేయించుకోవడం మంచిది.
గట్టిగా మారడం
శరీరంలో ఏదైనా భాగం గట్టిగా మారడం గమనిస్తే అది తప్పక క్యాన్సర్ లక్షణం అయ్యే అవకాశం ఉంది. చర్మ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్.. వంటి పలు క్యాన్సర్‌‌లలో అవయవభాగాలు గట్టిపడుతుంటాయి.
విపరీతమైన దగ్గు
ఎడతెరపి లేని దగ్గు రావడం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు లక్షణం కావొచ్చు. స్వరపేటిక లేదా థైరాయిడ్ గ్రంథిలో వచ్చే క్యాన్సర్‌‌లలో కూడా సాధారణంగా గొంతు బొంగురు పోవడం, దగ్గు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇవి కూడా
వీటితో పాటు గొంతు క్యాన్సర్‌‌లో ఆహారాన్ని మింగడం కష్టమవ్వడం, చర్మ క్యాన్సర్‌‌లో శరీర రంగు నల్లగా మారడం, దురద రావడం, జుట్టు బాగా పెరగడం లేదా పూర్తిగా రాలిపోవడం, మూత్రాశయ క్యాన్సర్‌‌లో రక్తం పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.