నట్స్ ఎలా తినాలో తెలుసా?

బెస్ట్ న్యూట్రియంట్స్
శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో డ్రై ఫ్రూట్స్, నట్స్ ముందుంటాయి. అందుకే చాలామంది డైట్‌లో భాగంగా బాదం, పిస్తా, వాల్నట్స్, జీడిపప్పు వంటివి తింటుంటారు. నట్స్‌ తింటే కొలెస్ట్రాల్‌తోపాటు గుండె పోటు ప్రమాదం కూడా తగ్గుతుంది.
ఇలా తినాలి
నట్స్‌లో మంచి ఫైబర్ కంటెంట్, హెల్దీ ఫ్యాట్స్‌తో పాటు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని బెస్ట్ స్నాక్స్ ఆప్షన్స్‌గా చెప్పుకోవచ్చు. అయితే వీటిని తినేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అవేంటంటే..
క్వాంటిటీ ఇలా..
నట్స్ మంచివి కదా అని మరీ ఎక్కువగా తినకూడదని చెప్తున్నారు న్యూట్రిషనిస్టులు. రోజువారి భోజనంలో 30 నుంచి 50 గ్రాముల వరకూ నట్స్ తీసుకోవచ్చట. మరీ ఎక్కువగా తీసుకుంటే లేనిపోని సమస్యలొస్తాయి.
వాల్నట్‌లు
వాల్నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యానికి మంచివి. అయితే వీటిని నేరుగా తినడం కంటే ఆరు నుంచి ఎనిమిది గంటలు నానబెట్టి తినడం మంచిది.
బాదం
బాదం పప్పుల్లో విటమిన్–ఈ తోపాటు మంచి కొవ్వులు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి అధిక బరువు, కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. అయితే వీటిని రాత్రంతా నానబెట్టి పొట్టు తీసుకుని మాత్రమే తినాలి.
జీడిపప్పు
జీడిపప్పులో హెల్దీ ఫ్యాట్స్‌తో పాటు మాంగనీస్, జింక్, మెగ్నీషియం వంటి మినరల్స్ కూడా ఉంటాయి. ఇవి హార్ట్ హెల్త్‌కు, షుగర్ కంట్రోల్‌కు మంచివి. అయితే వీటిని ఎలా తీసుకున్నా పర్వాలేదు. నేరుగా లేదా వేగించి కూడా తీసుకోవచ్చు. కూరలు, ప్రొటీన్ షేక్స్‌లో కూడా వాడుకోవచ్చు.
పిస్తా
యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కవగా ఉండే పిస్తా పప్పులు గుండె ఆరోగ్యానికి, రక్తపోటుని తగ్గించడానికి మేలు చేస్తాయి. వీటిని నేరుగా లేదా వేగించి తీసుకుంటే మంచిది.
వేరుశెనగలు
వేరుశెనగల్లో హెల్దీ ఫ్యాట్స్, ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి. అయితే వీటిని నానబెట్టి లేదా మొలకెత్తించి తీసుకుంటే మంచిది. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్లు తగ్గించడానికి సాయపడతాయి.