మామిడి పండ్లలో ఈ వెరైటీలు తెలుసా?

ఎన్నో రకాలు
పండ్లలో రారాజు అయిన మామిడి పండులో బోలెడు రకాలున్నాయని మీకు తెలుసా? వీటిలో ఒక్కోరకానికి ఒక్కో రుచి, రూపం ఉండడం మరో విశేషం. మనదేశంలో పాపులర్ మ్యాంగో వెరైటీలు ఇవే.
బంగినపల్లి
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండే వెరైటీ ఇది. దీనిరుచి ప్రత్యేకంగా ఉంటుంది. అత్యంత తియ్యనైన మామిడి పండ్లలో ఇది ఒకటి.
ఆల్ఫొన్సో
మ్యాంగో వెరైటీస్ లో ఆల్ఫొన్సో రారాజు వంటిది. దీని రుచి, సువాసన కారణంగా ఇది సూపర్ పాపులర్ అయింది. ఇది మహారాష్ట్ర ప్రాంతంలో ఎక్కువగా పండుతుంది. ఇది పసుపు, కుంకుమ రంగులో ఉంటుంది.
కేసర్
కేసర్ మామిడి పండ్లు గుజరాత్‌లో ఎక్కువగా పండుతాయి. దీని ఫ్లేవర్, రుచి కారణంగా దీన్ని స్వీట్లలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
హిమసాగర్
వెస్ట్ బెంగాల్, ఒడిశా ప్రాంతాల్లో పండే ఈ మామిడి పండ్లు పెద్ద సైజులో ఉంటుంది. దీన్ని పచ్చళ్ల తయారీకి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో ఫైబర్ తక్కువ. రసం ఎక్కువ.
లాంగ్రా
బీహార్‌లో ఎక్కువగా పండే లాంగ్రా మామిడి పండు పండిన తర్వాత కూడా ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
దాసేరి
దాసేరి మామిడి పండును ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తారు. ఇది పొడవుగా ఉంటుంది. దీన్ని ఐస్ క్రీమ్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు.