సీతాఫలం ఎందుకు తినాలంటే

బెస్ట్ సీజనల్ ఫ్రూట్
చలికాలం వచ్చిందంటే మార్కెట్లో సీతాఫలాలు కనిపిస్తుంటాయి. వింటర్‌‌లో బెస్ట్ సీజనల్ ఫ్రూట్‌గా దీన్ని చెప్పుకోవచ్చు. రుచికరమైన ఈ పండుతో బోలెడు ప్రయోజనాలున్నాయి. అవేంటంటే.
ఈ సమస్యలకు చెక్
సీతాఫలంలో క్యాలరీలతో పాటు పాస్ఫరస్, పొటాషియం, కాల్షియం వంటి మినరల్స్ కూడా ఎక్కువే. ఇందులో ఉండే మెగ్నీషియంతో గుండెనొప్పి, పక్షవాతం, కీళ్లనొప్పుల వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
ఇమ్యూనిటీ
సీతాఫలంలో రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ –సీ, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది చలికాలంలో వచ్చే స్కిన్ ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గిస్తుంది.
బరువు పెరగొచ్చు
బరువు పెరగాలనుకునే వాళ్లకు సీతాఫలం బెస్ట్​ ఆప్షన్​. ఇందులో ఉండే హై క్యాలరీలు, కార్బోహైడ్రేట్స్, డైటరీ ఫైబర్, గ్లూకోజ్ కంటెంట్.. బరువు పెరిగేందుకు తోడ్పడతాయి.
ఐరన్ కంటెంట్
సీతాఫలంలో ఉండే హై ఐరన్, విటమిన్– ఎ కంటెంట్.. రక్తం పెరిగేలా చేస్తాయి. రక్తహీనత సమస్య ఉన్నవాళ్లకు సీతాఫలం మంచి ఆప్షన్. అలాగే కంటి సమస్యలకు కూడా ఇది మంచి మెడిసిన్.
ఒత్తిడి లేకుండా
శీతాఫలంలో ఉండే విటమిన్‌–బీ6.. ఒత్తిడి, డిప్రెషన్‌ రాకుండా అడ్డుకుంటుంది. మెదడుని చురుగ్గా ఉంచుతుంది. అలాగే ఇందులో ఉండే రైబోఫ్లేవిన్.. నోటి అల్సర్లను తగ్గిస్తుంది.
ఆకులతో కూడా..
సీతాఫలం చెట్టు ఆకులతో చేసిన టీ కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ టీ తాగితే డయేరియా, అజీర్తి వంటి జీర్ణాశయ సమస్యలు తగ్గుతాయి.
క్యాన్సర్ రాకుండా..
శీతాఫలానికి క్యాన్సర్‌ కణాలతో పోరాడే లక్షణం కూడా ఉంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్.. లివర్‌ క్యాన్సర్‌, బ్రెయిన్ ట్యూమర్స్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను వ్యాపింపజేసే క్యాన్సర్ కణాలతో పోరాడతాయి.