న్యూ ఇయర్ ట్రిప్ కోసం బెస్ట్ ప్లేసులివే

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్
కొత్త సంవత్సరాన్ని కొత్తగా మొదలుపెట్టాలనుకుంటారు చాలామంది. అందుకే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం స్పెషల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటారు. మనదేశంలో న్యూ ఇయర్‌‌కు ఎలాంటి ప్లేసులు బాగుంటాయంటే..
గోవా
సెలబ్రేషన్స్ అనగానే అందరికీ గుర్తుచ్చే ప్లేస్ గోవా. ముఖ్యంగా క్రిస్టమస్ నుంచి న్యూ ఇయర్ వరకూ గోవాలో ఫెస్టివల్ మూడ్ ఉంటుంది. పెద్ద పెద్ద మ్యూజిక్ కాన్సెర్ట్‌లు, న్యూ ఇయర్ ఈవెంట్లు జరుగుతుంటాయి. మీరు పార్టీలను ఇష్టపడేవాళ్లైతే న్యూ ఇయర్‌‌కు గోవా ట్రిప్ వెళ్లాల్సిందే.
ఊటీ
పార్టీలు, హడావిడి లేకుండా కొత్త సంవత్సరాన్ని ప్రశాంతంగా గడపాలనుకుంటున్నారా అయితే ఊటీ బెస్ట్ ఆప్షన్. ఊటీలో కొద్దిపాటి సెలబ్రేషన్స్ మాత్రమే ఉంటాయి. లైవ్ మ్యూజిక్ కాన్సెర్ట్‌లు వంటివి జరుగుతాయి. కొత్తజంటలకు ఊటీ ట్రిప్ బాగుంటుంది.
జైపూర్
న్యూ ఇయర్‌‌ను బాగా గ్రాండ్‌గా జరుపుకోవాలనుకుంటున్నారా.. అయితే మీరు జైపూర్ వెళ్లాల్సిందే. ఆరోజు జైపూర్‌‌లోని ప్యాలెస్‌లన్నీ సెలబ్రేషన్స్‌తో నిండిపోతాయి. అక్కడ రూమ్స్ బుక్ చేసుకుని ఈవెంట్స్‌ను ఎంజాయ్ చేయొచ్చు. రాయల్ ఫుడ్ ఎక్స్‌పీరియెన్స్ చేయొచ్చు. అయితే ఇది కాస్త ఖర్చుతో కూడుకున్న విషయం.
గుల్మార్గ్
కొత్త ఏడాదిని మరింత ప్రత్యేకంగా జరుపుకోవాలంటే కశ్మీర్‌‌లోని గుల్మార్గ్, సోన్మార్గ్ వంటి ప్లేసులకు వెళ్లొచ్చు. సెలబ్రేషన్స్ వంటి వాటికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఏకాంతంగా గడపాలనుకునేవారికి ఇది బెస్ట్ చాయిస్.
గోకర్ణ
గోవాకు దగ్గర్లో ఉండే గోకర్ణలో టూరిస్ట్ కల్చర్ పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఫారెనర్స్ ఎక్కువ. బీచ్ లవర్స్‌.. ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. సముద్రాన్ని అనుకుని ఉండే చిన్నచిన్న కొండల్లో ఇండివిడ్యువల్‌గా సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్లడానికి ఇది మంచి ఆప్షన్.
మనాలి
న్యూ ఇయర్‌‌కు ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో కలిసి వెళ్లడానికి అనువైన ప్లేస్ మనాలి. ఇక్కడ ఫ్రెండ్స్ వెళ్లినా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో వెళ్లినా సెలబ్రేట్ చేసుకోవచ్చు. సెలబ్రేషన్స్, ప్రశాంతతం రెండూ సమపాళ్లలో ఉంటాయిక్కడ.