సమ్మర్‌‌లో వెళ్లాల్సిన బెస్ట్ బీచ్‌లు!

సమ్మర్ టూర్స్
సమ్మర్‌లో టూర్ అంటే చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఈ సీజన్‌లో వచ్చే సెలవుల కారణంగా చాలామంది ఫ్యామిలీ టూర్స్ వేస్తుంటారు. సమ్మర్‌‌లో బీచ్ ప్రదేశాలు ఇష్టపడేవాళ్లూ ఈ టూర్స్‌పై ఓ లుక్కేయొచ్చు.
అండమాన్ దీవుల్లో
సమ్మర్ వెకేషన్‌లో దూరంగా వెళ్లి ఐసోలేటెడ్‌గా ఎంజాయ్ చేయాలనుకుంటే అండమాన్ ప్రాంతానికి టూర్ వేయొచ్చు. ఇక్కడ స్వచ్ఛమైన బీచ్‌లను ఎంజాయ్ చేయడంతో పాటు తక్కువ టూరిస్టుల తాకిడితో ప్రశాంతంగా గడపొచ్చు.
లక్షద్వీప్
సమ్మర్‌‌లో వాటర్ అడ్వెంచర్స్ చేయాలనుకునేవాళ్లు లక్షద్వీప్ టూర్ ప్లాన్ చేయొచ్చు. ఇది కాస్త కాస్ట్లీతో కూడుకున్న ట్రిప్. షిప్ క్రూజ్‌లు, స్కూబా డైవింగ్ వంటి లగ్జరీ అడ్వెంచర్స్‌ను ట్రై చేయొచ్చు.
వర్కాలా
కేరళలోని వర్కాలా బీచ్‌లో సమ్మర్ టూర్ గడిపితే ఆ ఫీలే వేరు. చుట్టూ కొబ్బరి తోటల మధ్య అందమైన హోమ్ స్టేల్లో పల్లె వాతావరణాన్ని, సముద్రాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటే వర్కాలా బీచ్‌కు వెళ్లొచ్చు.
గోకర్ణ
మిగతా బీచ్‌లతో పోలిస్తే కర్నాటకలోని గోకర్ణ బీచ్ కాస్త ప్రత్యేకం. ఇక్కడ బీచ్ ఒడ్డున ఉండే కొండలు, గుట్టలు.. బీచ్‌కు ప్రత్యేకమైన లుక్‌నిస్తాయి. ఎంతో ఎత్తులోనుంచి సముద్రాన్ని అస్వాదించొచ్చు. ఇక్కడ కనిపించే ఫారిన్ టూరిస్టులు మరో ప్రత్యేకత.
కన్యాకుమారి
సముద్రం మీదుగా అందమైన సూర్యోదయాన్ని చూడాలనుకుంటే కన్యాకుమారికి వెళ్లా్ల్సిందే. దేశానికి చివరి భాగంలో ఉండే ఈ ప్లేస్‌లో సన్ రైజ్‌తో పాటు సన్‌సెట్ కూడా వీక్షించొచ్చు.
గోపాల్‌పూర్
ఒడిశాలోని గోపాల్‌పూర్ బీచ్.. సమ్మర్ టూర్‌‌కు బాగుంటుంది. ఇక్కడ బీచ్ రిసార్ట్స్, సీ ఫుడ్‌తోపాటు చిలికా లేక్ అందాలను కూడా ఎంజాయ్ చేయొచ్చు.