దక్షిణ భారతదేశంలో బెస్ట్ బీచ్‌లు ఇవే!

రామకృష్ణ బీచ్
విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్ నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉంటుంది. ఇక్కడ ప్రత్యక్షంగా సూర్యాస్తమయాన్ని వీక్షించేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు.
కోవలం బీచ్
కేరళలోని కోవలం బీచ్ దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ బీచ్‌లలో ఒకటి. ఇక్కడ నీళ్లు కూడా చాలా స్పష్టంగా ఉంటుంది.
కన్యాకుమారి బీచ్
తమిళనాడులోని కన్యాకుమారి బీచ్ ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా అరేబియా సముద్ర అందాలను, సూర్యాస్తమయ దృశ్యాలను చూడడానికి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.
ఇలియట్స్ బీచ్
చెన్నైలోని ఇలియట్స్ బీచ్ ఎంతో అందంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి వెకేషన్‌కు వెళ్లాలనుకునేవారికి ఇది అనువైన ప్రదేశం. ఇది చెన్నై నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది.
చెరాయ్ బీచ్
దక్షిణ భారతదేశంలో ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో కొచ్చి ఒకటి. చెరాయ్ బీచ్ సూర్యాస్తమయ దృశ్యాలను చూడడానికి పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటారు.
ఓం బీచ్
కర్ణాటకలోని గోకర్ణలోని ఓం బీచ్‌కు టూరిస్ట్‌ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇది సాంస్కృతికంగా, చారిత్రకంగా కూడా ఎంతో పేరు పొందింది.
కాలా పత్తర్ బీచ్
అండమాన్, నికోబార్‌లో కొలువై ఉన్న ఈ బీచ్‌ చుట్టూ ఎన్నో ప్రకృతి అందాలు ఉన్నాయి. కొత్తగా పెళ్లైనవారు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు.