ఐఫోన్ 15 హైలెట్స్ ఇవే..

లేటెస్ట్ ఫీచర్లు
ఎంతో గ్రాండ్‌గా లాంచ్ అయిన యాపిల్ ‘ఐఫోన్ 15’ లో అందరూ ఊహించినట్టుగానే చాలా కీలక మార్పులు జరిగాయి. గత ఐఫోన్లతో పోలిస్తే ఇందులో చాలా కొత్త ఫీచర్లు యాడ్ అయ్యాయి. అవేంటంటే..
డిజైన్
డిజైన్ పరంగా ఐఫోన్ 15 లో కొన్ని మార్పులు జరిగాయి. ఈ సారి ఫోన్లలో ఫ్రాస్టెడ్‌ గ్లాస్‌ బ్యాక్‌ ప్యానెల్‌ ఉండనుంది. ఇది ఫోన్‌పై ఫింగర్‌ప్రింట్లు, మరకలు పడకుండా చూస్తుంది. అలాగే ఫోన్ బరువు తగ్గించేందుకు ఈ సారి టైటానియం డిజైన్‌ తీసుకొచ్చారు.
టైప్‌ సీ పోర్ట్
ఇంటర్నేషనల్ టర్మ్స్‌కు అనుగుణంగా యాపిల్ కూడా టైప్–సీ పోర్ట్‌ను తీసుకొచ్చింది. ఇకపై ఐఫోన్‌ ఛార్జింగ్ కోసం ఇతరుల ఛార్జర్ కూడా వాడుకోవచ్చు.
యాక్షన్‌ బటన్‌
ఐ ఫోన్‌ 15లో ఫోన్‌కి పక్కభాగంలో సరికొత్త యాక్షన్ బటన్ యాడ్ అయింది. దీంతో కెమెరా, ఫ్లాష్‌లైట్‌, వాయిస్‌ మెమో, నోట్స్, రింగ్‌, వైబ్రేట్‌ వంటి ఆప్షన్స్‌ మార్చుకోవచ్చు.
కొత్త కెమెరా
లేటెస్ట్ ఐఫోన్‌ 15 లో 48 మెగా పిక్సెల్ కలిగిన కొత్త కెమెరా సెన్సర్‌‌ను అమర్చారు. దీంతో గతంలో కంటే మెరుగైన క్వాలిటీతో ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు.
ఫాస్ట్ ప్రాసెసర్‌
ఐఫోన్‌ 15 మోడల్స్‌లో ‘యాపిల్ ఏ16’ బయోనిక్‌ ప్రాసెసర్‌ను వాడారు. ఇది గత ప్రాసెసర్లతో పోలిస్తే ఏడు రెట్లు వేగంగా పని చేస్తుందని యాపిల్ చెప్తోంది.
ఐలాండ్‌ నాచ్
గతంలో ఐఫోన్ 14 సిరీస్‌లలోని ప్రో మోడళ్లలో డైనమిక్‌ ఐలాండ్‌ ఫీచర్.. ఈ సారి ఐఫోన్ 15 బేస్ మోడల్స్ నుంచీ ఉంది. డైనమిక్ ఐలాండ్ అంటే ఫోన్‌ స్క్రీన్‌పై ఉండే నాచ్ డిజైన్ లాంటిది. దీంట్లో కెమెరా, ఫేస్‌ ఐడీ వంటి సెన్సర్లు, నోటిఫికేషన్ల వంటి ఫంక్షన్లు ఉంటాయి.
మేడిన్ ఇండియా
మొట్టమొదటి ‘మేడిన్ ఇండియా ఐఫోన్’గా ఐఫోన్15 ఉండబోతోంది. రీసెంట్‌గా తమిళనాడులోని ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ ఫ్యాక్టరీలో ఐఫోన్ 15 తయారీ మొదలుపెట్టారు. త్వరలోనే అవి మార్కెట్లోకి రాబోతున్నాయి.