కొలెస్ట్రాల్ తగ్గించుకునేందుకు ఏడు చిట్కాలు!

గుండెకు ముప్పు
తీసుకునే ఆహారంలో చెడు కొలెస్ట్రాల్ ఉంటే అది గుండె సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ను నార్మల్‌గా ఉంచుకోవడం ఎంతైనా అవసరం. కొలెస్ట్రాల్ అదుపులో ఉండాలంటే ఈ ఏడు చిట్కాలు పాటిస్తే చాలు. అవేంటంటే.
నో స్మోకింగ్
పొగ తాగే అలవాటు వల్ల రక్తనాళాలో కొలెస్ట్రాల్ త్వరగా చేరుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఆ అలవాటుని మానుకోవాలి.
ఫ్యాట్స్‌తో జాగ్రత్త
శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ కొలెస్ట్రాల్ లెవల్స్‌ను పెంచుతాయి. కాబట్టి ఆహారంలో శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ లేకుండా చూసుకోవాలి. అంటే ఐస్‌క్రీమ్‌, ఫ్రైడ్ ఫుడ్స్, కేక్స్, బిస్కెట్స్, బేక్డ్ ఫుడ్స్, చీజ్ వంటి వాటిని తగ్గించాలి.
డైలీ వర్కవుట్స్
రోజూ కొంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవడం ద్వారా రక్తంలో కొలెస్ట్రాల్ నిల్వ ఉండకుండా చూసుకోవచ్చు. వారానికి కనీసం 150 నిముషాల వ్యాయామం ఉండడం అవసరం.
హెల్దీ డైట్
రోజువారీ ఆహారంలో నాన్​వెజ్​ ఫుడ్​, ఉప్పు శాతాన్ని తగ్గించి తాజా ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా కూడా కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.
వెయిట్ కంట్రోల్
కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు బాడీమాస్‌ ఇండెక్స్‌(బీఎంఐ) నార్మల్‌గా ఉండేలా చూసుకోవాలి. బరువు పెరగకుండా జాగ్రత్తపడాలి.
ఒత్తిడి వద్దు
ఒత్తిడి, డిప్రెషన్, యాంగ్జైటీ, కోపం వంటి నెగెటివ్ ఎమోషన్స్ వల్ల కూడా కొలెస్ట్రాల్ లెవల్స్, బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకూ హ్యాపీ లైఫ్‌ను లీడ్ చేయాలి.
టెస్ట్‌లు ముఖ్యం
కొన్నిసార్లు బరువు నార్మల్‌గా ఉన్నప్పటికీ కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి ఏడాదికొకసారైనా లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అలాగే బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ వంటివి చెక్‌ చేయించుకోవాలి.