జట్టు బలంగా, ఒత్తుగా పెరగడానికి 7 చిట్కాలు

పుదీనా
ప్రతిరోజు పుదీనా ఆకులను నమలడం వల్ల జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది. జుట్టు రాలడం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
కలబంద
జుట్టు సమస్యలను కలబంద జెల్ అద్భుతంగా పరిష్కరిస్తుంది. దీన్ని వాడటంవల్ల హెయిర్ దృఢంగా, మందంగా తయారవుతుంది. జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
మందార టీ
ప్రతిరోజు మందార టీ తాగడం వల్ల జుట్టుకు అంతర్గతంగా పోషణ లభిస్తుంది. తల చుట్టూ రక్త ప్రసరణ పెరుగుతుంది. అనేకరకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
రోజ్ మేరీ నూనె
రోజ్ మేరీ నూనె వాడటంల్ల కూడా జట్టు సమస్య నుంచి బయట పడవచ్చు. జుట్టు దృఢంగా, మందంగా తయారవుతుంది. జట్టు సమస్యతో బాధపడేవారు ఈ నూనెను వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు.
లావెండర్ టీ
లావెండర్ టీ ప్రతిరోజు క్రమం తప్పకుండా తాగడం వల్ల కూడా సులభంగా జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే గుణాలు జట్టు పెరుగుదలకు తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు.
కొబ్బరి నూనె
తలకు కొబ్బరి నూనె రాసుకునేవారు ఆ నూనెలో మందారం, కరివేపాకు, వేప ఉపయోగిస్తే మంచి ఫలితాలుంటాయి. వీటిని ఇంట్లోనే సులువుగా చేసుకోవచ్చు.
ఒత్తిడివల్ల జట్టు ఊడిపోతుంటుంది. మానసిక ఆరోగ్యం బాగుండేటట్లు చూసుకోవాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవడంతోపాటు ఎక్కువసేపు నిద్ర ఉండేటట్లు చూసుకోవాలి.