ప్రశాతంగా గడిపేందుకు ఏడు చిట్కాలు

మెంటల్ పీస్
జీవితంలో రకరకా పరిస్థితులు, సవాళ్లు ఎదురవుతుంటాయి. అయితే ప్రతీ సందర్భంలోనూ మానసికంగా ప్రశాతంగా ఉండడం నేర్చుకుంటే సమస్యలను చూసి భయపడాల్సిన పని ఉండదు. అనుకున్నది ఏదైనా సాధించొచ్చు. మరి మానసిక ప్రశాంతత కోసం ఏం చేయాలి?
లెట్ గో
జీవితంలో ‘లెట్ గో’ అనే ఫార్ములాను ఫాలో అవ్వడం ద్వారా సమస్యల ఊబిలో చిక్కుకోకుండా తప్పించుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. లెట్ గో అంటే.. జరిగేది జరుగుతుంది అని వదిలేయడం. ఇలా మీ ప్రయత్నం మీరు చేస్తూ జరిగేదాన్ని నేచర్‌‌కు వదిలేసి ముందుకెళ్తుండాలి.
కంపారిజన్ వద్దు
జీవితంలో కంపారిజన్ అనేది లేకపోతే సగం సమస్యలు తగ్గిపోతాయని మానసిక నిపుణుల సూచన. కాబట్టి చేసే పనిలో, సంపాదనలో, సక్సెస్‌లో.. ఇలా ఎందులోనూ కంపారిజన్ లేకుండా మీతో మీరు పోటీ పడుతూ ముందుకెళ్లాలి.
మౌనంగా..
ఇబ్బంది పెట్టే సందర్భాల్లో, కోపం వచ్చే పరిస్థితుల్లో మౌనంగా ఉండడం నేర్చుకుంటే ఒత్తిడి పెరిగే అవకాశమే ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి మౌనంగా ఉండడాన్ని ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి సిచ్యుయేషన్‌ను అయినా ఈజీగా దాటేయొచ్చు.
చిరునవ్వు
ముఖంపై ఎప్పుడూ చిరునవ్వు ఉండేలా చూసుకోవడం, రోజులో వీలైనంత ఎక్కువగా నవ్వడాన్ని అలవాటుగా చేసుకుంటే ఎలాంటి మానసిక సమస్యలు బాధించవని స్టడీల్లో తేలింది. కాబట్టి నవ్వుని మంచి మెడిసిన్‌గా వాడుకోవడం నేర్చుకోవాలి.
ఇగ్నోర్
ముఖ్యమైన విషయాలు పట్టించుకోవడంతోపాటు అవసరం లేని విషయాలను వదిలివేయడం కూడా నేర్చుకోవాలి. అప్పుడే జీవితంలో బ్యాలెన్స్ ఉంటుంది. ఇబ్బంది పెట్టే వ్యక్తులు, పరిస్థితులను ఇగ్నోర్ చేయడం నేర్చుకుంటే ఒత్తిడి లేకుండా జీవించే వీలుంటుంది.
టేక్ ఎ బ్రేక్
రోజువారీ జీవితం నుంచి అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవడం చాలా అవసరం అని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ప్రయాణాలు చేయడం, తగినంత రెస్ట్ తీసుకోవడం ద్వారా మనసు మరింత రిలాక్స్ అవుతుంది. సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి మనసుకి లభిస్తుంది.