గోళ్లు అందంగా ఉండాలంటే ఇలా చేయొచ్చు!

గోళ్లే అందం
అందమైన గోళ్లు ఉండాలని అమ్మాయిలు ఎక్కువగా కోరుకుంటారు. గోళ్లు పొడవుగా అందంగా కనిపించేందుకు ఎలాంటి చిట్కాలు ఫాలో అవ్వాలో ఇప్పుడు చూద్దాం.
ఆలివ్ ఆయిల్
ఆలివ్‌ ఆయిల్‌లో ఉండే విటమిన్‌–ఇ గోళ్లకు మంచి పోషణ అందిస్తుంది. రాత్రిళ్లు కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌ను గోళ్లమీద రాస్తే గోళ్లకు రక్తప్రసరణ జరిగి గోళ్లలో పెరుగుదల కనిపిస్తుంది.
వెల్లుల్లి
వెల్లుల్లి రెబ్బలను కట్ చేసి గోళ్లపై కాసేపు రుద్దుకోవడం ద్వారా గోళ్లు చిట్లిపోకుండా అడ్డుకోవచ్చు. నెయిల్ పాలిష్‌ను రిమూవ్ చేయడానికి కూడా వెల్లుల్లి పనికొస్తుంది.
వెనిగర్
గోళ్లు విరిగేపోయే సమస్య ఉన్నవాళ్లు స్పూన్ యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌లో కొద్దిగా వెల్లుల్లి తరుగు వేసి ఆ మిశ్రమాన్ని గోళ్లపై రాసి పది నిమిషాల తరువాత కడిగేస్తే నెయిల్స్ స్ట్రాంగ్‌గా తయారవుతాయి.
కొబ్బరినూనె
గోళ్ల అందం కోసం కొబ్బరినూనెను కూడా వాడుకోవచ్చు. కొబ్బరినూనెను గోళ్లపై రాసి మర్దన చేయడం చేయడం ద్వారా గోళ్లు సున్నితంగా పెరుగుతాయి.
ఆరెంజ్
ఆరెంజ్‌ జ్యూస్‌ను గోళ్లకు పూతలా అప్లైచేసి పదినిమిషాల తర్వాత కడిగేస్తే గోళ్లు మృదువుగా, అందంగా తయారవుతాయి.
శుభ్రత ముఖ్యం
గోళ్లు ఎక్కువగా పెంచడం వల్ల వాటిలో మట్టి పేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గోళ్లను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. గోళ్లను మరీ ఎక్కువగా కాకుండా మూడు లేదా నాలుగు మిల్లీమీటర్ల పొడవు మాత్రమే పెంచాలి.