ఈ ఐదు హోమ్ వర్కవుట్స్‌తో గుండె సేఫ్!

హార్ట్ కోసం కార్డియో
ఫిట్‌నెస్ కోసం ఎన్ని వర్కవుట్లు చేసినా గుండె సేఫ్‌గా ఉండాలంటే మాత్రం రోజువారీ వ్యాయామాల్లో కార్డియో వర్కవుట్స్ ఉండాల్సిందే.
హార్ట్ కెపాసిటీ
కార్డియో వర్కవుట్స్ అనేవి హార్ట్ కెపాసిటీ, లంగ్ కెపాసిటీని పెంచడంతో పాటు ఫ్యాట్ కరిగించేందుకూ తోడ్పతాయి. అలాంటి కొన్ని సింపుల్ హోమ్ కార్డియో వర్కవుట్స్ ఇప్పుడు చూద్దాం.
సిటప్స్
సిటప్స్ అంటే గుంజిళ్లు తీయడమే. ఇది ఎంతో సింపుల్ కార్డియో ఎక్సర్‌‌సైజ్. కేవలం రోజుకు ముప్ఫై నుంచి నలభై గుంజిళ్లు తీయడం ద్వారా గుండెను సేఫ్‌గా ఉంచుకోవచ్చు. సెట్‌కు పది చొప్పున మూడు లేదా నాలుగు సెట్లుగా ఈ వ్యాయామాన్ని చేసుకోవచ్చు.
పుషప్స్
పుషప్స్‌తో కేవలం కండరాలు మాత్రమే కాదు. గుండె వేగం కూడా పెరుగుతుంది. సెట్‌కి ఐదు చొప్పున రోజుకి నాలుగైదు సెట్లు పుషప్స్ చేస్తే హార్ట్ కెపాసిటీ పెరుగుతుంది.
బర్పీస్
బర్పీస్.. హై ఇంటెన్సిటీ కార్డియో వ్యాయామంగా పనిచేస్తుంది. బర్పీస్ చేయడం కోసం ముందుగా నిటారుగా నిల్చొని రెండు కాళ్లు గాల్లోకి లేచేలా ఒకసారి గెంతి వెంటనే కిందకు వంగి ఒక పుషప్ తీయాలి. ఇలా ఐదు నుంచి పది సార్లు రిపీట్ చేయాలి.
జంపింగ్ జాక్స్
నిటారుగా నిల్చొని ఒకేసారి రెండు కాళ్లు దూరం జరుపుతూ, చేతులు పైకి లేపుతూ ఈ ఎక్సర్‌‌సైజ్ చేయాలి. ఇది సింపుల్ కార్డియో వర్కవుట్. ఎంత ఎక్కువసేపు చేస్తే అంత రిజల్ట్ ఉంటుంది.
మెల్లగా మొదలుపెట్టి..
కార్డియో వ్యాయమాలు మెల్లగా మొదలుపెట్టి క్రమంగా సెట్లుపెంచుకుంటూ పోవాలి. రొప్పు ఎక్కువగా వచ్చినప్పుడు ఆపేయాలి. చేస్తున్నప్పుడు ఏవైనా ఇబ్బంది, నొప్పిగా అనిపిస్తే.. డాక్టర్ లేదా ఫిట్‌నెస్ ట్రైనర్ సలహా తీసుకోవాలి.