కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఇన్ని అద్భుత ప్రయోజనాలా?
శరీరాన్ని డిటాక్స్‌ చేస్తాయ్
కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది మీ శరీరం నుంచి అదనపు నీటిని, వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. కొబ్బరి నీళ్లలో యాంటీఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి, ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
జీర్ణక్రియకు మేలు చేస్తుంది
కొబ్బరి నీరు కడుపుని శాంతపరుస్తుంది. ప్రేగు కదలకలను సులభతరం చేస్తుంది. కొబ్బరినీళ్లు జీర్ణక్రియకు మేలు చేస్తుంది. మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. కొబ్బరి నీళ్లలో మంచి మొత్తంలో ఎలక్ట్రోలైట్స్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఎసిడిటీతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగితే.. ఉపశమనం లభిస్తుంది. కొబ్బరినీళ్లలోని ఆల్కలీన్‌ గుణాలు.. ఎసిడిటీకి చెక్‌ పెడతాయి. ఇవి pHను బ్యాలెన్స్‌ చేస్తాయి.
ఇమ్యూనిటీ బూస్ట్‌ అవుతుంది
2013 అధ్యయనం ప్రకారం కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్‌తో సమర్థవంతంగా పోరాడగలవు. ఇది మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది, అనేక అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్స్‌ నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.
గర్భిణులకు మంచిది
గర్భిణులు.. కొబ్బరి నీళ్లు తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లలో ఉండే.. విటమిన్‌ బి9 కడుపులో బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా వేధించే.. జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి.
షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది
షుగర్‌ పేషెంట్స్‌.. కొబ్బరి నీళ్లు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయనే అపోహలో ఉంటారు. కానీ, కొబ్బరి నీళ్లు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గంచడంలో సాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.