బీభత్సం సృష్టించిన మంచు తుపానులు
అమెరికాలో మంచుతుపానుల ధాటికి ముగ్గురు పౌరులు మృత్యువాత
BY Raju Asari7 March 2025 1:19 PM IST

X
Raju Asari Updated On: 7 March 2025 1:19 PM IST
అమెరికాలో మంచు తుపానులు బీభత్సం సృష్టించాయి. మిస్సిసిపిలో మంచుతుపానుల ధాటికి ముగ్గురు పౌరులు మృత్యువాత పడ్డారు. ఒక్లహామాలో ఇళ్ల పైకప్పులు ఎగిరిగిపోయాయి. రోడ్లు, భవనాలపై కొన్ని అడుగులు మందంతో మంచుమేటలు వేసింది. రోడ్డు కనిపించకపోవడంతో జారడం వంటి కారణాలతో అయోవాలో 63కు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. మిన్నియాపాలిస్‌లో ఈ సీజన్‌లోనే అత్యధిక హిమపాతం నమోదైంది. అమెరికా తూర్పు నుంచి మధ్య ప్రాంతాల్లో విస్తరించిన భూభాగాల్లో మంచు తుపానులు విరుచుకుపడే ప్రమాదం ఉన్నదని అక్కడి వాతావరణ విభాగం హెచ్చరించింది. కాలిఫోర్నియాతో పాటు పశ్చిమ ప్రాంతాల్లో మంచు తుపానులతో పాటు భారీ వర్షాలు పడుతాయని అంచనా వేసింది. మిన్నియాపాలిస్ సహా అయోవాలో శక్తిమంతమైన మంచు తుపానులు విరుచుకుపడుతాయని తెలిపింది.
Next Story