Telugu Global
NEWS

వాట్సాప్ మెసేజ్‌లో త‌ప్పులు దొర్లాయా!.. ఇలా ఈజీగా ఎడిట్ చేసేయొచ్చు

అయితే ఇలా మెసేజ్ పంపిన 15 నిమిషాల్లోపు మాత్ర‌మే దాన్ని ఎడిట్ చేయ‌గ‌ల‌రు. ఆ త‌ర్వాత సాధ్య‌ప‌డ‌దు. అంతేకాదు మీరు మెసేజ్ పంపిన‌వారికి ఎడిటెడ్ మెసేజ్ అనే కామెంట్‌ను కూడా చూపిస్తుంది.

వాట్సాప్ మెసేజ్‌లో త‌ప్పులు దొర్లాయా!.. ఇలా ఈజీగా ఎడిట్ చేసేయొచ్చు
X

వాట్సాప్ లేని స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లేదంటే అతిశ‌యోక్తి కాదు. మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు ఇలా ఏదైనా చిటికెలో షేర్ చేసుకోవ‌చ్చు. అది కూడా చ‌దువురాని వాళ్లు కూడా షేర్ చేయ‌గ‌లిగేంత ఈజీగా ఉండ‌టం వాట్సాప్ స‌క్సెస్ మంత్రం. కానీ ఒక్కోసారి టైప్ చేసేట‌ప్పుడు పొర‌పాటున ఏదైనా వేరే అక్ష‌రం ప‌డితే అర్థం మారిపోతుంది. టైప్ ఎర్ర‌ర్ అని మ‌ళ్లీ మెసేజ్ పెడుతుంటాం. ఇప్పుడు ఆ బాధ లేదు. జ‌స్ట్ చిన్న స్టెప్‌తో ఈజీగా ఎడిట్ చేసుకోవ‌చ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఇలా!

ఆండ్రాయిడ్ ఫోన్‌లో అయితే మీరు త‌ప్పుగా పంపిన మెసేజ్ మీద లాంగ్ ప్రెస్ చేయండి. మోర్ ఆప్ష‌న్స్ (more options) అని వ‌స్తుంది. అందులో నుంచి ఎడిట్ (Edit)ను సెలెక్ట్ చేసి మీ మెసేజ్‌ను స‌రి చేయండి. ఇప్పుడు అప్‌డేట్ చేయండి. అంతే మీరు త‌ప్పుగా పంపిన పాత మెసేజ్ ప్లేస్‌లో ఎడిట్ చేసిన కొత్త మెసేజ్ వెళ్లిపోతుంది.

ఐఫోన్‌లో అయితే

అదే ఐఫోన్‌లో అయితే అయితే మీరు త‌ప్పుగా పంపిన మెసేజ్ మీద లాంగ్ ప్రెస్ చేయండి. వ‌చ్చిన ఆప్ష‌న్ల‌లో నుంచి Editను సెలెక్ట్ చేయండి. మీ మెసేజ్‌ను స‌రి చేయండి. ఇప్పుడు అప్‌డేట్ చేయండి. మీరు త‌ప్పుగా పంపిన పాత మెసేజ్ ప్లేస్‌లో ఎడిట్ చేసిన కొత్త మెసేజ్ వెళ్లిపోతుంది.

పావుగంట‌లోపు అయితేనే ఎడిట్ ఆప్ష‌న్

అయితే ఇలా మెసేజ్ పంపిన 15 నిమిషాల్లోపు మాత్ర‌మే దాన్ని ఎడిట్ చేయ‌గ‌ల‌రు. ఆ త‌ర్వాత సాధ్య‌ప‌డ‌దు. అంతేకాదు మీరు మెసేజ్ పంపిన‌వారికి ఎడిటెడ్ మెసేజ్ అనే కామెంట్‌ను కూడా చూపిస్తుంది. అంటే మీరు ఏం ఎడిట్ చేశారో చూడ‌క‌పోయినా ఎడిట్ చేశార‌ని మాత్రం మెసేజ్ రిసీవ్ చేసుకున్న‌వారికి వర్తిస్తుంది. ఇంకో విష‌యం ఇది టెక్స్ట్ష్ మెసేజ్‌కే ప‌రిమితం. ఫోటో, వీడియాల‌ను వేరేవాటితో రీప్లేస్ చేసే అవ‌కాశం ప్ర‌స్తుతానికి లేదు.

First Published:  3 Sep 2023 7:52 AM GMT
Next Story