Telugu Global
NEWS

Vivo Y28 5G | వివో నుంచి బ‌డ్జెట్ ఫ్రెండ్లీ వివో వై28 5జీ.. ఇలా రాయితీలు.. !

15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ క‌లిగి ఉంటుంది. వివో వై28 5జీ (Vivo Y28 5G) ఫోన్ ఐపీ54 డ‌స్ట్‌, స్ప్లాష్ రెసిస్టెన్స్ రేటింగ్ అందుకున్న‌ది.

Vivo Y28 5G | వివో నుంచి బ‌డ్జెట్ ఫ్రెండ్లీ వివో వై28 5జీ.. ఇలా రాయితీలు.. !
X

Vivo Y28 5G | ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ వివో (Vivo) త‌న బ‌డ్జెట్ ఫ్రెండ్లీ.. వివో వై28 5జీ ఫోన్‌ను భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించింది. తాజా వివో వై-సిరీస్ ఫోన్ రెండు క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.56-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే క‌లిగి ఉంది. వివో వై28 5జీ (Vivo Y28 5G) మీడియా టెక్ డైమెన్సిటీ 6020 ఎస్‌వోసీ (MediaTek Dimensity 6020 SoC) చిప్‌సెట్, 8జీబీ ర్యామ్ విత్ 128జీబీ స్టోరేజీ వేరియంట్‌గా వ‌స్తున్న‌ది. 50-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సెన్స‌ర్ కెమెరాతో డ్యుయ‌ల్ రేర్ కెమెరా యూనిట్‌తో వ‌స్తున్న‌ది. 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ క‌లిగి ఉంటుంది. వివో వై28 5జీ (Vivo Y28 5G) ఫోన్ ఐపీ54 డ‌స్ట్‌, స్ప్లాష్ రెసిస్టెన్స్ రేటింగ్ అందుకున్న‌ది.

ఇవీ వివో వై28 5జీ ఫోన్ ధ‌ర‌లు

వివో వై28 5జీ (Vivo Y28 5G) ఫోన్ 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ ధ‌ర రూ.13,999 ప‌లుకుతుంది. 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ రూ.15,499, 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ రూ. 16,999 ప‌లుకుతుంది. ఈ ఫోన్ క్రిస్ట‌ల్ ప‌ర్పుల్‌, గ్లిట్ట‌ర్ ఆక్వా క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది.

సోమ‌వారం నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు వివో ఇండియా ఈ-స్టోర్‌, దేశంలోని ప్ర‌ధాన రిటైల్ స్టోర్ల‌లో ల‌భిస్తుంది. ఎస్బీఐ, డీబీఎస్‌, ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్ బ్యాంకు కార్డుల‌తో కొనుగోలు చేస్తే రూ.1,500 వ‌ర‌కూ డిస్కౌంట్ అందుకోవ‌చ్చు.

ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..

వివో వై28 5జీ (Vivo Y28 5G) ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఫ‌న్‌ట‌చ్ ఓఎస్ 13 వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది. ఈ ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.56- అంగుళాల హెచ్‌డీ + (720 x1,612 పిక్సెల్స్‌) స్క్రీన్ క‌లిగి ఉంటుంది. 269 పిక్సెల్ డెన్సిటీతోపాటు 840 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ క‌లిగి ఉంటుంది. ఒక్టాకోర్ 7ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఎస్వోసీ చిప్ సెట్, 12 జీబీ ర్యామ్‌.. వ‌ర్చువ‌ల్‌గా 16 జీబీ ర్యామ్ వ‌ర‌కూ పొడిగించుకోవ‌చ్చు.

50-మెగా పిక్సెల్స్ ప్రైమ‌రీ సెన్స‌ర్ కెమెరా విత్ ఎఫ్‌/2.0 అపెర్చ‌ర్, 2-మెగా పిక్సెల్ సెన్స‌ర్ విత్ ఎఫ్‌/2.4 అపెర్చ‌ర్ లెన్స్ కెమెరా ఉంటాయి. ఇక సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్స్ సెన్స‌ర్ కెమెరా ఉంటుంది. వివో వై28 5జీ (Vivo Y28 5G) ఫోన్ వై-ఫై, బ్లూటూత్ 5.1, యూఎస్బీ 2.0 పోర్ట్‌, జీపీఎస్‌, ఓటీజీ, ఎఫ్ఎం రేడియో, ఏ-జీపీఎస్ క‌నెక్టివిటీ క‌లిగి ఉంటుంది. యాక్సెల‌రో మీట‌ర్ సెన్స‌ర్‌, యాంబియెంట్ లైట్ సెన్స‌ర్‌, క‌ల‌ర్ టెంప‌రేచ‌ర్ సెన్స‌ర్‌, ఈ-కంపాస్‌, గైరోస్కోప్‌, ప్రాగ్జిమిటీ సెన్స‌ర్ త‌దిత‌ర సెన్స‌ర్లు ఉంటాయి. బ‌యో మెట్రిక్ అథంటికేష‌న్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్ కూడా ఉంట‌ది.

First Published:  9 Jan 2024 4:56 AM GMT
Next Story