Telugu Global
NEWS

వంద కుటుంబాలకు రూ.కోటి పంచుతా..

తన మీద, తన సినిమా మీద సోషల్‌మీడియాలో దాడులు జరుగుతున్నాయన్నారు. కొందరు డబ్బులిచ్చి మరీ సినిమాపై నెగెటివిటీ తీసుకొస్తున్నారంటూ కామెంట్స్ చేశారు.

వంద కుటుంబాలకు రూ.కోటి పంచుతా..
X

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. తన లేటెస్ట్ మూవీ ఖుషి సక్సెస్‌తో ఎంజాయ్‌ చేస్తున్న ఈ స్టార్‌.. ఈ సినిమా ద్వారా సంపాదించిన దాంట్లో వంద కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున కోటి రూపాయలు అందిస్తానని ప్రకటించారు. వారం రోజుల్లో ఈ పని పూర్తి చేస్తానన్నారు. విశాఖపట్నంలో సోమవారం నిర్వహించిన ఖుషి సక్సెస్ మీట్‌లో విజయ్ ఈ ప్రకటన చేశారు. ఈ నిర్ణయంపై విజయ్‌ ఫ్యాన్స్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌మీడియాలో విజయ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఇక ఇదే సమయంలో సంచలన కామెంట్స్ చేశారు విజయ్ దేవరకొండ. తన మీద, తన సినిమా మీద సోషల్‌మీడియాలో దాడులు జరుగుతున్నాయన్నారు. కొందరు డబ్బులిచ్చి మరీ సినిమాపై నెగెటివిటీ తీసుకొస్తున్నారంటూ కామెంట్స్ చేశారు. ఎన్నో ఫేక్ రేటింగ్స్, యూ ట్యూబ్ ఫేక్ రివ్యూలను దాటుకుని ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోందంటే దానికి అభిమానుల ప్రేమే కారణమని చెప్పుకొచ్చారు. ఈ సినిమా విషయంలో మీ ముఖాల్లో నవ్వులు చూడాలనుకున్న నా కోరిక నెరవేరిందని చెప్పారు విజయ్. ఇన్నాళ్లు..డబ్బు సంపాదించాలి, అమ్మ,నాన్నలను హ్యాపీగా ఉంచాలి, సమాజంలో గౌరవం పొందాలి..అనే దృష్టితోనే పని చేశానని.. ఇక నుంచి మీ కోసం పని చేస్తానని అభిమానులనుద్దేశించి మాట్లాడారు విజయ్.

ఇక ఖుషి సినిమాను మజిలీ ఫేమ్‌ డైరెక్టర్‌ శివ నిర్వాణ.. లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. మలయాళ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్‌ హేషమ్‌ అబ్దుల్‌ వహద్‌ మ్యూజిక్ అందించాడు. ఇక సెప్టెంబర్‌ 1న విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌తో నడుస్తోంది.

*

First Published:  5 Sep 2023 5:36 AM GMT
Next Story