Telugu Global
NEWS

సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్, ప్రిలిమ్స్ ఎప్పుడంటే..

గతంలో విడుదల చేసిన క్యాలెండర్‌కు అనుగుణంగానే ఫిబ్రవరి 14న నోటిఫికేషన్‌ ఇచ్చింది. UPSC CSE 2024 పరీక్షకు నేటి నుంచి మార్చి 5వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్, ప్రిలిమ్స్ ఎప్పుడంటే..
X

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న వాళ్లకు శుభవార్త. అఖిల భారత సర్వీసుల్లో 1,056 ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) బుధవారం నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. గతంలో విడుదల చేసిన క్యాలెండర్‌కు అనుగుణంగానే ఫిబ్రవరి 14న నోటిఫికేషన్‌ ఇచ్చింది. UPSC CSE 2024 పరీక్షకు నేటి నుంచి మార్చి 5వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ పరీక్ష మే 26న, మెయిన్స్ అక్టోబర్ 19న జరగనుంది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి కింది లింక్ క్లిక్ చేయండి

https://upsconline.nic.in/upsc/OTRP/index.php

నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి సమాచారం కోసం కింది లింక్ క్లిక్ చేయండి

https://upsc.gov.in/sites/default/files/Notif-CSP-24-engl-140224.pdf

సివిల్స్‌ నోటిఫికేషన్‌లో ముఖ్యాంశాలు

విద్యార్హతలు:

అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి బ్యాచిలర్ డిగ్రీలో పాస్ అవ్వాలి.

వయో పరిమితి:

అభ్యర్థుల వయసు 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఆయా వర్గాలకు రిజర్వేషన్ల ఆధారంగా మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

ఓబీసీ, ఇతర అభ్యర్థులకు రూ.100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు మినహాయింపు)

ప్రిలిమినరీ పరీక్ష:

ఇందులో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటాయి. ఈ ప్రశ్నల్లో నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్‌ రాసేందుకు అనుమతిస్తారు.

మెయిన్స్‌ పరీక్ష:

ఇది డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. మెయిన్స్ పాసైన తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించి రూల్‌ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమ్స్‌ పరీక్ష కేంద్రాలు:

హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం.

మెయిన్స్‌ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ

First Published:  14 Feb 2024 10:55 AM GMT
Next Story