Telugu Global
NEWS

Tollywood Movies: టాలీవుడ్ బంగారు బాతుగుడ్డు సంక్రాంతి

Tollywood movies: క్రిటిక్స్ కూడా ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాకు కూడా కనీసం 3 రేటింగ్ ఇవ్వలేదు. అందరూ 2.5 లేదా అంతకంటే తక్కువ రేటింగ్ ఇచ్చారు. తక్కువ రేటింగ్ తెచ్చుకున్న ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి.

Tollywood Movies: టాలీవుడ్ బంగారు బాతుగుడ్డు సంక్రాంతి
X

సంక్రాంతి పండుగ సినిమాల విడుదలకు అత్యంత అనుకూల సీజన్. సమ్మర్ తర్వాత సినిమాల విడుదలకు అత్యంత అనువైన సీజన్ గా సంక్రాంతిని చెప్పుకుంటారు. సంక్రాంతి సమయంలో విడుదలైన సినిమాలకు మంచి వసూళ్లు దక్కుతుంటాయి. సినిమాలు కాస్త అటు ఇటుగా ఉన్నా ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. అందుకే ఏడాది మొత్తానికిగాను సంక్రాంతి పండుగకు తమ సినిమాలు విడుదల చేసేందుకు నిర్మాతలు, హీరోలు ఉత్సాహం చూపుతుంటారు. సినిమా ఓ మోస్తారుగా ఉన్నా సంక్రాంతి పండుగ కాపాడుతుందని నమ్మకం. ఈ సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు దక్కుతున్న కలెక్షన్లే ఇందుకు ఉదాహరణ.

Advertisement

ఈ రెండు సినిమాలకు విడుదలైన రోజు మిశ్రమ స్పందన వచ్చింది. క్రిటిక్స్ కూడా ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాకు కూడా కనీసం 3 రేటింగ్ ఇవ్వలేదు. అందరూ 2.5 లేదా అంతకంటే తక్కువ రేటింగ్ ఇచ్చారు. తక్కువ రేటింగ్ తెచ్చుకున్న ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు చిరంజీవి, బాలకృష్ణ కెరీర్లలో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలుగా నిలిచాయి.

Advertisement

వాల్తేరు వీరయ్య రొటీన్ మాస్ మూవీగా పేరు తెచ్చుకున్నప్పటికీ అందులో చిరంజీవి మార్క్ యాక్షన్, కామెడీ ఉండటంతో పండగ సమయంలో ఆ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపారు. అలాగే బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ఆయన గతంలో నటించిన పలు ఫ్యాక్షన్ సినిమాల్లాగే ఉన్నప్పటికీ మంచి వసూళ్లు దక్కాయంటే పండుగ ఎఫెక్టే కారణం.

తమిళంలో కూడా ఇదే పరిస్థితే. రొటీన్ సినిమాలుగా పేరు తెచ్చుకున్న విజయ్ వారసుడు, అజిత్ తెగింపు సినిమాలు రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించాయి. ఇప్పుడే కాదు గతంలో కూడా సంక్రాంతి సమయంలో వచ్చిన పలు సినిమాలు బ్లాక్ బాస్టర్, ఇండస్ట్రీ హిట్లుగా నిలవడంతో ఈ సీజన్ సినిమా వాళ్లకు బంగారు బాతు గుడ్డుగా మారింది. అందుకే నిర్మాతలు, హీరోలు సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చేసుకునేందుకు ముందే కర్చీఫ్ లు వేసుకుంటూ ఉంటారు. సంక్రాంతి హంగామా ఇటీవలే ముగియగా అప్పుడే వచ్చే సంక్రాంతికి కూడా రామ్ చరణ్ -శంకర్ మూవీ, అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ డేట్స్ ని ఫిక్స్ చేసుకుంటూ ఉండటం ఈ సీజన్ కు ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో తెలియజేస్తోంది.

Next Story