Telugu Global
NEWS

Venkatesh 75th Movie: వెంకటేష్ 75వ సినిమా ప్రకటన

Venkatesh 75th Movie: జనవరి 25వ తేదీన ఈ సినిమాకు సంబంధించి పెద్ద అప్డేట్ ఇస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అందులో ఓ బ్లాస్టింగ్ ప్రదేశంలో వెంకటేష్ గన్ చేతిలో పట్టుకొని వెళుతున్నట్లు ఉంది.

Venkatesh 75th Movie: వెంకటేష్ 75వ సినిమా ప్రకటన
X

Venkatesh 75th Movie: వెంకటేష్ 75వ సినిమా ప్రకటన

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తన 75వ సినిమాపై ప్రకటన చేశాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు ట్వీట్ చేశాడు. వరుసగా సినిమాలను లైన్ లో పెట్టే వెంకటేష్ కొంతకాలంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గతేడాది సంక్రాంతికి ఎఫ్ -3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకటేష్ ఆ తర్వాత విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ఓరి దేవుడా అనే సినిమాలో గెస్ట్ రోల్ పోషించారు. ఆ తర్వాత వెంకీ మరో తెలుగు సినిమాలో నటించలేదు. హిందీలో మాత్రం ఆయన సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న కిసీ కా భాయ్.. కిసీ కా జాన్ అనే సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.

Advertisement


తాజాగా వెంకటేష్ శైలేష్ కొలను దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. హిట్, హిట్-2 సినిమాల ప్రాంఛైజీకి శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. ఇప్పుడు ఆయన వెంకటేష్ హీరోగా ఓ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు.

Advertisement

జనవరి 25వ తేదీన ఈ సినిమాకు సంబంధించి పెద్ద అప్డేట్ ఇస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అందులో ఓ బ్లాస్టింగ్ ప్రదేశంలో వెంకటేష్ గన్ చేతిలో పట్టుకొని వెళుతున్నట్లు ఉంది. ఈ పోస్టర్ ని బట్టి శైలేష్ కొలను తన మార్క్ యాక్షన్ ఫిల్మ్ వెంకీతో చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు 25వ తేదీన ప్రకటించనున్నారు.

Next Story