Telugu Global
NEWS

ఇలా చేస్తే అందమైన పాదాలు అందుకుంటాయి పొగడ్తలు..

పాదాలపై ఉన్న మురికి, డెడ్ స్కిన్ సెల్స్ పోవాలంటే వాటికి స్క్రబింగ్ అవసరం. ఇది చాలా సులభం. ఇంట్లో ఉండే పంచదార, నిమ్మకాయను తీసుకోండి. పాదాలను శుభ్రంగా కడిగి గోరు వెచ్చటి నీటిలో కాసేపు ఉంచండి.

ఇలా చేస్తే అందమైన పాదాలు అందుకుంటాయి పొగడ్తలు..
X

అందం అంటే శ్రద్ద ఉన్నవారు ఎవరైనా శరీరం అంతా బాగుండాలనే అనుకుంటారు. కానీ, చాలామంది ముఖంపై పెట్టిన శ్రద్ధ వేరే ఇతర శరీర భాగాలపై చూపించరు. అందులో పాదాలు ఒకటి. ముఖం అందంగా మెరిసిపోతూ కనిపించినా.. పాదాల విషయం వచ్చే సరికి మురికిగా, నల్లగా, పేలిపోయి కనిపిస్తాయి. దానికి కారణం పాదాల విషయంలో సరైన జాగ్రత్త తీసుకోకపోవడమే. నిజం చెప్పాలి అంటే పాదాలే ఎండకు ఎక్కువగా ఎక్స్ పోజ్ అవుతాయి, నీటిలో తడుస్తాయి, ఇంకా దుమ్మూ, ధూళి తగలడానికి బాగా అవకాశం ఉంటుంది. వీటిని సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే నల్లగా మారతాయి. దీంతో నచ్చిన చెప్పులను కూడా ధరించలేరు. ఈ చిన్న టిప్స్ పాటిస్తే మీ పాదాలను తెల్లగా, అందంగా మార్చుకోవచ్చు.



స్క్రబింగ్..

పాదాలపై ఉన్న మురికి, డెడ్ స్కిన్ సెల్స్ పోవాలంటే వాటికి స్క్రబింగ్ అవసరం. ఇది చాలా సులభం. ఇంట్లో ఉండే పంచదార, నిమ్మకాయను తీసుకోండి. పాదాలను శుభ్రంగా కడిగి గోరు వెచ్చటి నీటిలో కాసేపు ఉంచండి. ఆ తర్వాత నిమ్మ చెక్కను పంచదారపై అద్ది.. దాన్ని పాదాలపై రుద్దాలి. ఇలా ఓ ఐదు నుంచి 10 నిమిషాల పాటు చేయాలి. ఆ తర్వాత పాదాలను శుభ్రంగా కడిగేసుకోవాలి. నెక్ట్స్ మంచి మాయిశ్చరైజర్ ను సెలక్ట్ చేసుకుని దాన్ని పాదాలకు అప్లై చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మీ పాదాలు శుభ్రంగా ఉంటాయి.



పాదాలపై ట్యానింగ్ ఎలా తొలగించాలి అంటే..

మన దంతాలను తెల్లగా చేసే టూత్‌పేస్ట్ పాదాలపై కనిపించే మరకలను తొలగించి, చర్మపు రంగును మెరుగుపరుస్తుంది. బేకింగ్ సోడా మరియు నిమ్మకాయ చర్మం కొత్త మెరుపును సంతరించుకొనేందుకు దోహద పడతాయి. పాదాల ట్యానింగ్‌ను తొలగించడానికి పై మూడింటితో కలిపి సమపాళ్ళలో తీసుకొని బాగా మిక్స్ చేసి బ్రష్ సహాయంతో పాదాలకు అప్లై చేయండి. కాసేపటి తరువాత నిమ్మతొక్కతో పాదాలను స్క్రబ్ చేయండి. ఆపై నీటితో కడిగేయండి. ఈ ప్యాక్‌ని వారానికి రెండు సార్లు వేసుకోవడం వల్ల ట్యానింగ్ నుండి పూర్తిగా బయటపడవచ్చు. ఇలా చేస్తే మీ ముఖమే కాదు మీ పాదాలు కూడా పొగడ్తలు అందుకుంటాయి.

First Published:  6 Oct 2023 1:32 PM GMT
Next Story