Telugu Global
NEWS

అనూహ్యం.. బాలయ్యపై విజయ్ పైచేయి

భగవంత్ కేసరిపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. పాజిటివ్ బజ్‌తో విడుదలైన ఈ సినిమా కంటే తమిళ డబ్బింగ్ సినిమా లియోకు కలెక్షన్లు అధికంగా రావడం ఇప్పుడు సినీ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది.

అనూహ్యం.. బాలయ్యపై విజయ్ పైచేయి
X

నందమూరి బాలకృష్ణకు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పన‌క్కర్లేదు. దశాబ్దాలుగా ఆయన అగ్రహీరోగా రాణిస్తున్నారు. అలాంటి హీరో నటించిన సినిమా ఇవాళ విడుదల కాగా.. ఆ సినిమాకు మించి ఒక తమిళ డబ్బింగ్ సినిమాకు జనం పోటెత్తడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇవాళ బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాతోపాటు తమిళ అగ్ర హీరో విజయ్ నటించిన లియో విడుదలైంది.

భగవంత్ కేసరి సినిమాకు సక్సెస్‌ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా కాజల్ హీరోయిన్ గా నటించింది. శ్రీలీల బాలకృష్ణ కూతురిగా ప్ర‌ధాన‌ పాత్ర పోషించింది. అఖండ, వీరసింహారెడ్డి వంటి వరుస హిట్ల తర్వాత బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరిపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. పాజిటివ్ బజ్‌తో విడుదలైన ఈ సినిమా కంటే తమిళ డబ్బింగ్ సినిమా లియోకు కలెక్షన్లు అధికంగా రావడం ఇప్పుడు సినీ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది.

డైరెక్టర్ లోకేష్ కనగరాజ‌న్ - విజయ్ కాంబినేషన్లో గతంలో మాస్టర్ వంటి సూప‌ర్ హిట్ రాగా.. ఇక లోకేష్ గత చిత్రం విక్రమ్ సంచలన హిట్ కొట్టింది. దీంతో లియో సినిమాపై తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపారు. భగవంత్ కేసరి, లియో ఇవాళ ఒకేరోజు విడుదల కాగా, బాలకృష్ణ సినిమాకు మించి విజయ్ సినిమాకు కలెక్షన్లు వస్తున్నాయి. బుక్ మై షో యాప్ ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది.

మామూలుగా ఒక అగ్ర హీరో నటించే సినిమా విడుదల అవుతుందంటే ముందు రోజే టికెట్లన్నీ అమ్ముడవుతుంటాయి. అలాంటిది భగవంత్ కేసరి టికెట్లు రిలీజ్ రోజు కూడా సులభంగా దొరుకుతున్నాయి. బుక్ మై షో యాప్ ఓపెన్ చేస్తే చాలా కేంద్రాల్లో సీట్లు ఖాళీగా దర్శనమిస్తూ గ్రీన్ బాక్స్ లు కనిపిస్తున్నాయి. అదే సందర్భంలో లియో సినిమా టికెట్లన్నీ ఫిలప్ అయి సీట్లు ఫుల్ అయినట్లు కనిపిస్తున్నాయి.

తెలుగులో బాలకృష్ణ ఇమేజ్ తో పోల్చుకుంటే విజయ్ రేంజ్ చాలా తక్కువ. అయినప్పటికీ లియో సినిమాపైనే ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. లోకేష్ గత చిత్రం విక్రమ్ తెలుగులో అద్భుత విజయం సాధించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

First Published:  19 Oct 2023 6:56 AM GMT
Next Story