Telugu Global
NEWS

సూర్య `కంగువ‌`.. ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల‌.. - అభిమానుల‌కు బ‌ర్త్‌డే గిఫ్ట్‌

ఈ చిత్రం టైటిల్ కూడా అదే అర్థం వ‌చ్చేదే పెట్ట‌డం గ‌మ‌నార్హం. కంగువ అంటే అగ్ని శక్తి ఉన్న వ్యక్తి, పరాక్రమవంతుడు అని అర్థం. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా త్రీడీలో.. పది భాషల్లో రూపొందిస్తున్నారు.

సూర్య `కంగువ‌`.. ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల‌.. - అభిమానుల‌కు బ‌ర్త్‌డే గిఫ్ట్‌
X

విల‌క్ష‌ణ పాత్ర‌లను ఎంచుకోవ‌డం, విభిన్న‌మైన ప్ర‌యోగాలు చేయ‌డంలో ఎప్పుడూ ముందుండే హీరో సూర్య తాజాగా న‌టిస్తున్న చిత్రం `కంగువ‌`. ఆయ‌న‌ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్ర‌మిది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ గ్లింప్స్‌ను ఆ చిత్ర బృందం శ‌నివారం విడుద‌ల చేసింది. ఇందులో ఇప్ప‌టివ‌ర‌కు చేయ‌ని స‌రికొత్త పాత్ర‌లో సూర్య క‌నిపించడం విశేషం.

ఈ చిత్రంలోని యుద్ధ స‌న్నివేశాల‌ను ప్ర‌తిబింబించేలా ఈ ఫ‌స్ట్ గ్లింప్స్‌ను చిత్ర బృందం రూపొందించింది. శ‌వాల గుట్ట‌ల‌తో, తీవ్రంగా గాయ‌ప‌డిన దేహాల‌తో ఉన్న ఈ గ్లింప్స్‌.. చిత్రంపై అత్యంత ఆస‌క్తి రేకెత్తించేలా ఉంది. యాక్ష‌న్ ప్ర‌ధానంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న‌ట్టుగా ఫ‌స్ట్ గ్లింప్స్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఇందులో సూర్య చేసిన పాత్ర అత్యంత ప‌రాక్ర‌మ‌వంతుడిగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఈ చిత్రం టైటిల్ కూడా అదే అర్థం వ‌చ్చేదే పెట్ట‌డం గ‌మ‌నార్హం. కంగువ అంటే అగ్ని శక్తి ఉన్న వ్యక్తి, పరాక్రమవంతుడు అని అర్థం. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా త్రీడీలో.. పది భాషల్లో రూపొందిస్తున్నారు. యాక్ష‌న్ స‌న్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ ఆస‌క్తిగా రూపొందిస్తున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. 2024 ప్రారంభంలో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని చిత్ర వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆదివారం సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది.

First Published:  23 July 2023 2:55 AM GMT
Next Story