Telugu Global
NEWS

నాకు అలాంటి వరుడు కావాలి.. యువతి వింత ప్రకటన వైరల్

తనకు కాబోయే భాగస్వామి తనతో కలిసి జంటగా రీల్స్ చేయాలని, సరికొత్త, విభిన్నమైన రీల్స్ చేసేందుకు తగిన ఐడియాలు ఇవ్వాలని చెప్పింది.

నాకు అలాంటి వరుడు కావాలి.. యువతి వింత ప్రకటన వైరల్
X

ఒకప్పుడు పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయికి తమ అమ్మాయి నచ్చితే చాలని తల్లిదండ్రులు భావించేవారు. అయితే ఇప్పుడు కాలం మారింది. అమ్మాయికి నచ్చిన వ్యక్తితోనే తల్లిదండ్రులు వివాహం చేస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు పెళ్లి విషయంలో తమ కుమార్తెలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారు. అందుకే యువతులు తమకు నచ్చిన వ్యక్తినే ఎంపిక చేసుకుంటున్నారు.

కాగా, తాజాగా సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ అయిన ఓ యువతి తనకు ఎటువంటి వరుడు కావాలో వివరిస్తూ చేసిన వింత ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన పేరు రియా అని.. తనకు మ్యాచ్ అయ్యే వరుడి కోసం తాను అన్వేషిస్తున్నట్లు ఓ ప్రకటన ద్వారా తెలిపింది. తనకు కాబోయే భాగస్వామి సోషల్ మీడియాలో రీల్స్ చేసేవాడు అయి ఉండాలని.. అతడికి కెమెరా ముందు సిగ్గు ఉండకూడదని పేర్కొంది.

అంతేకాదు తనకు కాబోయే భాగస్వామి తనతో కలిసి జంటగా రీల్స్ చేయాలని, సరికొత్త, విభిన్నమైన రీల్స్ చేసేందుకు తగిన ఐడియాలు ఇవ్వాలని చెప్పింది. ఇక వరుడు ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయి ఉండకూడదని తెలిపింది.

అమెజాన్ మినీ టీవీలో స్ట్రీమ్ అవుతున్న ఆఫ్ లవ్ ఆఫ్ అరేంజ్డ్ చూసి తనకు ఎలాంటి అబ్బాయి అయితే నచ్చుతాడో తెలుసుకోవాలని కోరింది. వరుడికి తాను చేసే రీల్స్ ను ఎడిట్ చేసే నైపుణ్యం ఉండాలని తెలిపింది. తనకు కాబోయే వరుడి కోసం యువతి ఇచ్చిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రకటన చూసిన నెటిజన్లు కూడా ఆసక్తికరంగా రిప్లై ఇస్తున్నారు. కాబోయే భాగస్వామికి ఈ అర్హతలు ఉంటే చాలా?..ఇంకా ఏమైనా ఉంటే చెప్పాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

First Published:  29 Oct 2023 12:03 PM GMT
Next Story