Telugu Global
Cinema & Entertainment

బన్నీ ట్విట్టర్ ఫాలోవర్స్ 7 మిలియన్స్ ..!

అల్లు అర్జున్ తాజా సినిమా పుష్ప బాలీవుడ్ లో బంపర్ హిట్ కావడంతో అక్కడ కూడా బన్నీకి ఫ్యాన్స్ పెరిగారు. ఇప్పుడు ట్విట్టర్ లో బన్నీ ఫాలోవర్స్ సంఖ్య 7 మిలియన్స్ కి చేరింది.

బన్నీ ట్విట్టర్ ఫాలోవర్స్ 7 మిలియన్స్ ..!
X

సినిమాల హిట్లలోనే కాదు.. సోషల్ మీడియా ప్లాట్ ఫారాల్లో ఇతర హీరోల కంటే తగ్గేదె లేదంటున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బన్నీ తన రెండో సినిమా ఆర్యతోనే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుని స్టార్ హీరోగా మారాడు. ఒక్క తెలుగులోనే కాదు ఆ సినిమాతో మలయాళంలోనూ క్రేజ్‌సంపాదించాడు. త్రివిక్రమ్ తో చేసిన అల వైకుంఠపురంలో మూవీ బన్నీ రేంజ్ ని భారీగా పెంచగా సుకుమార్ తో చేసిన పుష్ప మూవీ పాన్ ఇండియా హీరోగా మార్చింది.

సోషల్ మీడియా ప్లాట్ ఫారాల్లో మొదటి నుంచి బన్నీకి భారీగా ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే ఆయన ఇన్‌స్టాగ్రామ్ లో 18 మిలియన్ ఫాలోవర్స్ తో టాలీవుడ్ లో ఏ హీరోకు అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇప్పుడు ట్విట్టర్ లో కూడా బన్నీ తన రేంజ్ ని పెంచుకున్నాడు. అల్లు అర్జున్ తాజా సినిమా పుష్ప బాలీవుడ్ లో బంపర్ హిట్ కావడంతో అక్కడ కూడా బన్నీకి ఫ్యాన్స్ పెరిగారు. ఇప్పుడు ట్విట్టర్ లో బన్నీ ఫాలోవర్స్ సంఖ్య 7 మిలియన్స్ కి చేరింది.

దీనిపై అల్లు అర్జున్ కూడా తన సంతోషాన్ని పంచుకున్నాడు. ' నాపై ఇంత ప్రేమ చూపిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు' అని ట్వీట్ చేశాడు. తన ఫాలోవర్స్ 7 మిలియన్స్ కి చేరుకున్న సందర్భంగా ప్రత్యేకంగా ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. బన్నీ పోస్ట్ చేసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప -2 లో నటిస్తున్నాడు.

First Published:  17 Aug 2022 8:58 AM GMT
Next Story