Telugu Global
NEWS

ఆర్ఆర్ఆర్ టీమ్‌కి అరుదైన గౌర‌వం.. - ఆస్కార్ క‌మిటీలో ప్యాన‌ల్ స‌భ్యులుగా ఆరుగురికి ఛాన్స్‌

తెలుగు చలనచిత్ర చరిత్రలోనే రికార్డు సాధించిన వీరికి ఆస్కార్ కమిటీలో చోటు కల్పించడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ టీమ్‌కి అరుదైన గౌర‌వం.. - ఆస్కార్ క‌మిటీలో ప్యాన‌ల్ స‌భ్యులుగా ఆరుగురికి ఛాన్స్‌
X

ఆస్కార్ అవార్డుతో అంత‌ర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు పొందిన `ఆర్ఆర్ఆర్‌` చిత్ర బృందానికి తాజాగా మ‌రో గౌర‌వం ద‌క్కింది. ఇప్ప‌టికే ఎన్నో అవార్డులు అందుకున్న ఈ చిత్ర బృందానికి ఇప్పుడు ఏకంగా ఆస్కార్ క‌మిటీలో అవకాశం ల‌భించింది. ఆస్కార్ ప్యానల్ క‌మిటీ స‌భ్యులుగా `ఆర్ఆర్ఆర్‌` చిత్రానికి చెందిన ఆరుగురు ఎంపిక‌య్యారు.

ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డులను ప్రదానం చేసే 'ద అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కొత్తగా ఆస్కార్ కమిటీలో 398 మందికి సభ్యత్వం కల్పించింది. ఇందులో 'ఆర్ఆర్ఆర్‌` టీమ్‌కు చెందిన ఆరుగురు ఉండగా, వారిలో మన స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో పాటు సంగీత దర్శకుడు కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్,ఛాయాగ్రాహకుడు సెంథిల్, ప్రొడక్షన్ డిజైనర్ సిరిల్ ఉన్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా వీరికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే మణిరత్నం, కరణ్ జోహార్ కు కూడా ఆస్కార్ కమిటీ ఆహ్వానం పలికింది.

తెలుగు చలనచిత్ర చరిత్రలోనే రికార్డు సాధించిన వీరికి ఆస్కార్ కమిటీలో చోటు కల్పించడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే దర్శక ధీరుడు రాజమౌళికి కూడా స్థానం కల్పించి ఉంటే బాగుండేదంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాదికి గానూ ఆస్కార్ ఆర్గనైజర్స్ మెంబర్ షిప్ దక్కించుకున్న వారిలో 40 శాతం మంది మహిళలు ఉన్నారు. వచ్చే ఏడాది ఆస్కార్ వేడుక మార్చి 10న జ‌ర‌గ‌నుంది.

First Published:  29 Jun 2023 7:00 AM GMT
Next Story