Telugu Global
NEWS

Samsung Galaxy S24 200 | మెగా పిక్సెల్ కెమెరా.. ఏఐ అసిస్ట్ ఫీచ‌ర్ల‌తో శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 సిరీస్ ఫోన్లు..

అమెరికాలోని కాలిఫోర్నియా సిటీలోని శాన్ జోస్ శాప్ సెంట‌ర్‌లో ఈ ఫోన్ల‌ను మార్కెట్లో ఆవిష్క‌రించారు. నోట్ అసిస్ట్, చాట్ అసిస్ట్‌, రియ‌ల్ టైం లాంగ్వేజ్ ట్రాన్స్‌లేష‌న్‌, స‌ర్కిల్ టు సెర్చ్ త‌దిత‌ర అత్యంత ఆధునిక ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఫీచ‌ర్లు జ‌త చేశారు.

Samsung Galaxy S24 200 | మెగా పిక్సెల్ కెమెరా.. ఏఐ అసిస్ట్ ఫీచ‌ర్ల‌తో శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 సిరీస్ ఫోన్లు..
X

Samsung Galaxy S24 200 | ద‌క్షిణ కొరియా టెక్ కంపెనీ శాంసంగ్ అత్యంత శ‌క్తిమంత‌మైన ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 సిరీస్ ఫోన్ల‌ను మార్కెట్లో ఆవిష్క‌రించింది. వీటిల్లో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత చాటింగ్ అసిస్ట్ ఫీచ‌ర్లు జ‌త చేశారు. ఈ సిరీస్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 ఆల్ట్రా, శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24+, శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 ఫోన్లు ఉన్నాయి. మూడు వేరియంట్ ఫోన్ల‌పై ప్రీ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఈ నెల 31 నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి.

శాంసంగ్‌తోపాటు ఆపిల్ త‌న ఐ-ఫోన్ 15 మోడ‌ల్స్‌ను భార‌త్‌లోనే తయారుచేసి దేశీయంగా విక్ర‌యించ‌డంతోపాటు విదేశాల‌కు ఎగుమ‌తి చేస్తున్న‌ది. గూగుల్ త‌న ఫ్లాగ్‌షిప్ ఫోన్ గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ ఈ ఏడాది చివ‌ర్లో దేశీయంగా ఉత్ప‌త్తి చేయ‌నున్న‌ది. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.79,999, గెలాక్సీ ఎస్‌24+ ఫోన్ రూ.99,999, గెలాక్సీ ఎస్‌24 ఆల్ట్రా ఫోన్ రూ.1,29,999 నుంచి ప్రారంభం అవుతుంది.

అమెరికాలోని కాలిఫోర్నియా సిటీలోని శాన్ జోస్ శాప్ సెంట‌ర్‌లో ఈ ఫోన్ల‌ను మార్కెట్లో ఆవిష్క‌రించారు. నోట్ అసిస్ట్, చాట్ అసిస్ట్‌, రియ‌ల్ టైం లాంగ్వేజ్ ట్రాన్స్‌లేష‌న్‌, స‌ర్కిల్ టు సెర్చ్ త‌దిత‌ర అత్యంత ఆధునిక ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఫీచ‌ర్లు జ‌త చేశారు. ఈ ఫోన్ల‌కు ఏడేండ్ల వ‌ర‌కు సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ అప్‌డేట్స్ ల‌భిస్తాయి.

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫోటో అసిస్ట్ టూల్ శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 సిరీస్‌లో ఉంటుంది. ఏఐ జ‌న‌రేటెడ్ ఎడిటింగ్ టూల్ సాయంతో ప‌ని చేస్తుంది. దీంతో ఏ ఫోటోనైనా తొల‌గించొచ్చు. మ‌రో ఫైల్‌లోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేయొచ్చు. క్లిక్లింగ్ త‌ర్వాత ఫోటో క్వాలిటీ విస్త‌రించొచ్చు. దీంతోపాటు స‌ర్కిల్ టు సెర్చ్ ఫీచ‌ర్ జ‌త చేశారు. ఏదైనా అంశంపై మ‌న‌కు తేలిగ్గా ఉన్న భాష‌లోకి మార్చ‌డంతోపాటు తేలిగ్గా చ‌దువుకోవ‌డానికి నోట్ అసిస్ట్ ఫీచ‌ర్ కూడా వ‌చ్చేసింది. చాట్ అసిస్ట్ ఫీచ‌ర్ రియ‌ల్‌టైం కాల్ ట్రాన్స్‌లేష‌న్ ఫీచ‌ర్‌గా ఉంటుంది. ఇత‌రుల‌తో చాటింగ్ చేస్తున్న‌ప్పుడు హిందీతో స‌హా 30 భాష‌ల్లో మీరు ఎంచుకున్న భాష‌లో రియ‌ల్‌టైం లైవ్ ట్రాన్స్‌లేష‌న్ ఆప్ష‌న్ క‌లిగి ఉంటుందీ చాట్ అసిస్ట్‌.

గెలాక్సీ ఏఐ పేరుతో ఇన్‌బిల్ట్ ఏఐ ఫీచ‌ర్ల‌తో వ‌స్తున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 సిరీస్ ఫోన్ల‌న్నీ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ వ‌న్ యూఐ 6.1 వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తాయి. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు డైన‌మిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్‌ప్లే క‌లిగి ఉంటాయి. గెలాక్సీ ఎస్‌24 ఫోన్ 8జీబీ ర్యామ్‌, టాప్ ఎండ్ గెలాక్సీ ఎస్‌24+, గెలాక్సీఎస్‌24 ఆల్ట్రా ఫోన్లు 12 జీబీ ర్యామ్‌తో వ‌స్తున్నాయి. గెలాక్సీ ఎస్‌24 ఆల్ట్రా వేరియంట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 8 జెన్ 3 ఎస్వోసీ చిప్‌సెట్ క‌లిగి ఉంటాయి. మూడు వేరియంట్లు ఐపీ68 రేటెడ్ డ‌స్ట్ అండ్ వాట‌ర్ రెసిస్టెంట్ కెపాసిటీతో వ‌స్తున్నాయి.

గెలాక్సీ ఎస్‌24 సిరీస్ ఫోన్ క‌ల‌ర్ ఆప్ష‌న్లు ఇలా

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 ఫోన్లు అంబ‌ర్ ఎల్లో, కోబ‌ల్ట్ వ‌యోలెట్‌, ఓన్యిక్స్ బ్లాక్ క‌ల‌ర్, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌24+ ఫోన్లు కోబాల్ట్ వ‌యోలెట్‌, ఓన్యిక్స్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో పొందొచ్చు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వారికి స‌ఫైర్ బ్లూ, జేడ్ గ్రీన్ క‌ల‌ర్స్‌లోనూ ల‌భిస్తాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24+ ఫోన్ కొనుగోలు చేయ‌డంతో రూ.22 వేల విలువైన బెనిఫిట్లు పొందొచ్చు. 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్‌ ప్రీ-బుకింగ్ చేసుకుంటే 512 జీబీ స్టోరేజీ అప్‌గ్రెడేష‌న్ ఫ్రీగా చేస్తారు. అద‌నంగా రూ.12 వేల అప్‌గ్రేడ్ బోన‌స్ అందుకోవ‌చ్చు. గెలాక్సీ ఎస్‌24 ఫోన్ అప్‌గ్రేడ్ బోన‌స్‌తోపాటు రూ.15 వేల వ‌ర‌కూ ల‌బ్ధి పొందొచ్చు. ప్రీ బుకింగ్స్ చేసుకున్న వారికి రూ.4,999 విలువ గ‌ల ఫ్రీ వైర్‌లెస్ చార్జ‌ర్ డ్యూ ఆఫ‌ర్ కూడా అందుబాటులో ఉంది.

ఇవీ శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 ఆల్ట్రా స్పెషిఫికేష‌న్లు

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 ఆల్ట్రా ఫోన్ క్వాడ్ కెమెరా సెట‌ప్ క‌లిగి ఉంటుంది. 200 మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సెన్స‌ర్ కెమెరా విత్ ఎఫ్‌/1.7 అపెర్చ‌ర్‌, 12-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా విత్ ఎఫ్‌/2.2 అపెర్చ‌ర్‌, 50-మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా విత్ 5ఎక్స్ ఆప్టిక‌ల్ జూమ్ అండ్ ఎఫ్‌/3.4 అపెర్చ‌ర్‌, 10-మెగా పిక్సెల్ కెమెరా విత్ ఎఫ్‌/2.4 అపెర్చ‌ర్ ఉంటాయి. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 12-మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఎఫ్‌/2.2 అపెర్చ‌ర్ క‌లిగి ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 ఆల్ట్రా ఫోన్‌లో ఒక టిగాబైట్ వ‌ర‌కూ స్టోరేజీ కెపాసిటీ ఉంటుంది. 5జీ, 4జీ ఎల్‌టీఈ, వై-ఫై 7, బ్లూటూత్ 5.3, జీపీఎస్‌, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్ క‌నెక్టివిటీ క‌లిగి ఉంటుంది. 45వాట్ల చార్జింగ్ మద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ ఉంటుంది. బ్యాట‌రీకి 2.0 ఫాస్ట్ వైర్‌లెస్ చార్జింగ్‌, వైర్‌లెస్ ప‌వ‌ర్ షేర్ స‌పోర్ట్ ల‌భిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్24, శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24+ స్పెషిఫికేష‌న్స్ ఇలా

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 ఆల్ట్రాతోపాటు శాంసంగ్ గెలాక్సీ ఎస్24, శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24+ ఫోన్ల‌లో కొన్ని స్పెషిఫికేష‌న్లు కామ‌న్‌. శాంసంగ్ గెలాక్సీ ఎస్24, శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24+ వేరియంట్లు 6.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్క్రీన్‌, 6.7 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ+ డిస్‌ప్లే క‌లిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్ల‌లో వాడే ప్రాసెస‌ర్ ఏద‌న్న‌ది బ‌య‌ట పెట్ట‌లేదు. రెండు ఫోన్ల‌లోనూ 50-మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 12-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 10 -మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా విత్ 3ఎక్స్ ఆప్టిక‌ల్ జూమ్ క‌లిగి ఉంటాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 ఆల్ట్రా మోడ‌ల్‌లో మాదిరే సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 12-మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఎఫ్‌/2.2 అపెర్చ‌ర్ వ‌స్తుంది.

రెండు ఫోన్ల‌లోనూ 512 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీ కెపాసిటీ ఉంటుంది. వై-ఫై 6ఈ నెట్‌వ‌ర్క్ మిన‌హా గెలాక్సీ ఎస్‌24+ మాదిరే అన్ని ర‌కాల క‌నెక్టివిటీ ఫీచ‌ర్లు ఉంటాయి. గెలాక్సీ ఎస్‌24 ఫోన్ 25 వాట్ల వైర్డ్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 4000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ, గెలాక్సీ ఎస్‌24+ ఫోన్ 45 వాట్ల వైర్డ్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 4900 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తాయి.

First Published:  19 Jan 2024 9:50 AM GMT
Next Story