Telugu Global
NEWS

ప్ర‌భాస్ చిత్రం `ప్రాజెక్ట్‌-కే` అరుదైన రికార్డు.. - ఆ ఈవెంట్‌కు హాజ‌ర‌య్యే తొలి తెలుగు సినిమా ఇదే..

అమెరికాలో ఈ నెల 20 నుంచి 23 వ‌ర‌కు ఈ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. ఈ ఈవెంట్‌కు హాజరుకానున్న తొలి భారతీయ సినిమాగా 'ప్రాజెక్ట్-కె' రికార్డు సృష్టించింది.

ప్ర‌భాస్ చిత్రం `ప్రాజెక్ట్‌-కే` అరుదైన రికార్డు.. - ఆ ఈవెంట్‌కు హాజ‌ర‌య్యే తొలి తెలుగు సినిమా ఇదే..
X

ప్యాన్ ఇండియా స్టార్‌ హీరో ప్ర‌భాస్ న‌టిస్తున్న టైమ్ ట్రావెల్ మూవీ `ప్రాజెక్ట్‌-కె`. దీనిని భారీ వ్య‌యంతో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రీక‌రిస్తున్న ఈ సినిమా విడుద‌ల‌కు ముందే అరుదైన రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన 'శాన్ డియాగో కామిక్ కాన్' ఈవెంట్‌లో ఈ సినిమా పాల్గొననున్నట్టు ఆ చిత్ర బృందం తాజాగా ప్రకటించింది.

అమెరికాలో ఈ నెల 20 నుంచి 23 వ‌ర‌కు ఈ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. ఈ ఈవెంట్‌కు హాజరుకానున్న తొలి భారతీయ సినిమాగా 'ప్రాజెక్ట్-కె' రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ ఓ ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. దీనిపై చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. భారత్ గొప్ప కథలకు, సినిమాలకు నిలయమ‌ని తెలిపారు. త‌మ‌ చిత్రంతో ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నామ‌ని చెప్పారు. ప్రపంచ ప్రేక్షకులకు 'ప్రాజెక్ట్-కె' కథను పరిచయం చేయడానికి శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ సరైన వేదిక అని తామంతా భావిస్తున్నామ‌ని వివ‌రించారు.

First Published:  7 July 2023 5:59 AM GMT
Next Story