Telugu Global
NEWS

ప్ర‌భాస్ ప్రాజెక్ట్‌-కె టైటిల్ ఖ‌రారు.. - ఆస‌క్తి రేపుతున్న‌ గ్లింప్స్‌

గ్లింప్స్ లోని విజువ‌ల్స్ విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. 'వాటీజ్ ప్రాజెక్ట్ కె` అనే ఒక్క డైలాగ్‌తో ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేలా యాక్షన్ సీన్స్ ఉన్నాయి.

ప్ర‌భాస్ ప్రాజెక్ట్‌-కె టైటిల్ ఖ‌రారు.. - ఆస‌క్తి రేపుతున్న‌ గ్లింప్స్‌
X

ప్ర‌భాస్ అభిమానులే కాదు.. సినీ అభిమానులంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ప్ర‌భాస్ సైన్స్ ఫిక్ష‌న్ చిత్రం `ప్రాజెక్ట్‌-కె` టైటిల్ ఖ‌రారైంది. దీంతో పాటు ఈ చిత్రం గ్లింప్స్ కూడా విడుద‌లైంది. అమెరికాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక 'శాన్ డియాగో కామిక్ కాన్' (San Diego Comic Con) వేడుకలో ఈ చిత్ర బృందం వీటిని ప్ర‌క‌టించ‌డం విశేషం. ఈ ఈవెంట్ లో ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించుకున్న తొలి భారతీయ సినిమాగా ఇది రికార్డుకెక్కింది.

ఇంత‌కీ ఈ చిత్రం టైటిల్ ఏమిటంటే.. 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD). దీంతో పాటు ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన గ్లింప్స్ లోని విజువ‌ల్స్ విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. 'వాటీజ్ ప్రాజెక్ట్ కె` అనే ఒక్క డైలాగ్‌తో ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేలా యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ప్రభాస్, కమల్ హాసన్, నిర్మాత అశ్వనీదత్, రానా ద‌గ్గుబాటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.

'మహానటి` చిత్రం తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇది భారీ బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్న సైన్స్ ఫిక్ష‌న్ సినిమా కావ‌డం.. ఇందులో ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తుండ‌టంతో ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి మ‌రింత పెరిగింది. ఈ చిత్రంలో అగ్ర న‌టులు అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌టం గ‌మ‌నార్హం. దీంతో ఈ సినిమాపై అంచ‌నాలు ఒక్క‌సారిగా భారీగా పెరిగిపోయాయి. బాలీవుడ్ నటి దీపికా పదుకొణె హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ఈ చిత్రంలో దిశా పటానీ కీ రోల్ పోషిస్తోంది.

First Published:  21 July 2023 1:57 AM GMT
Next Story